Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పంజాబ్ ప్రావిన్స్‌లో విద్యార్థులపై ఉపాధ్యాయుల అత్యాచారం..

victimboy
, మంగళవారం, 21 నవంబరు 2023 (12:05 IST)
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు పాడుపనులకు పాల్పడ్డారు. తమ వద్ద చదువుకునే విద్యార్థుల్లో 15 మందిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్ దేశఁలోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ ప్రావిన్స్‌లోని ఓ మతపరమైన విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థుల్లో 15 మంది మైనర్ విద్యార్థులపై ఇద్దరు ఉపాధ్యాయులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత విద్యార్థలంతా 10 నుంచి 12 యేళ్ళ వయసువారే కావడం గమనార్హం. దీనిపై పంజాబ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఉస్మాన్ అన్వర్ స్పందిస్తూ, ఈ విషయం వెలుగులోకి రావడంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. 
 
విద్యార్థులంతా 10 నుంచి 12 ఏళ్ల లోపువారేనన్నారు. మరోవైపు బాధితుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని, ఆ దిశగా దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. బాధిత విద్యార్థి ఒకరు తనకు జరిగిన ఘోరాన్ని తండ్రికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎప్పటిలాగే పాఠశాల దగ్గర దించుతుండగా అందులో చదువుతున్న ఓ విద్యార్థి తన తండ్రి ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు. 
 
ఎందుకని ప్రశ్నించగా వెక్కివెక్కి ఏడుస్తూ విషయం చెప్పాడు. ఈ సమస్య తనొక్కడిదే కాదని, తన లాంటివారు చాలా మంది ఉన్నారని చెప్పడంతో వెంటనే ఆ తండ్రి పంజాబ్ పోలీసులను ఆశ్రయించాడు. పాఠశాలకు వెళ్లి విచారణ జరిపిన పోలీసులు... జరిగిన విషయాన్ని తెలుసుకొని నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. బాధితులైన 15 మంది విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు.
 
విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరగడం వాస్తవమేనని తేలింది. అంతేకాకుండా వాళ్ల శరీరాలపై పంటిగాట్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఓ చాకును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పంజాబ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మోహిన్ నఖ్వీ స్పందించారు. బాధిత కుటుంబాలను న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నేరస్తులకు కఠిన శిక్షపడేలా చేయాలని ఇన్స్పెక్టర్ జనరలు ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటకలో దారుణ ఘటన-కాబోయే భర్త ఇంట్లో యువతి శవమై..?