హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ముగ్గురు కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దీనిపై బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మీర్‌పేటలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై అతని ముగ్గురు స్నేహితులు సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి అతడిపై కేసు పెట్టింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురి చేసింది.