Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్త వేధింపులు.. పెళ్లయిన 8 నెలలకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దుర్మణం

suicide

ఠాగూర్

, శనివారం, 12 అక్టోబరు 2024 (10:06 IST)
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వివాహమైన ఎనిమిది నెలలకే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. భర్తతో పాటు అత్తారింటి వేధింపుల కారణంగా ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. మృతురాలి తండ్రి వెల్లడించిన వివరాల మేరరకు.. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం, నందిపేటకు చెందిన సుప్రియారెడ్డి(26)ను అదే జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మిపల్లికి చెందిన మద్దూరు రాఘవేందర్ రెడ్డికి ఇచ్చి మార్చి 24న వివాహం చేశారు.
 
భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిలు. కేపీహెచ్‌బీ ఠాణా పరిధి శంషీగూడలో ఉంటున్నారు. వివాహమైన నెల నుంచే రాఘవేందర్ రెడ్డి భార్యని వేధించసాగాడు. తాను చెప్పినట్టే వినాలని, ఆమె జీతం తన బ్యాంకు ఖాతాలోనే జమచేయాలని, ఇల్లు కట్టుకునేందుకు పుట్టింటి నుంచి 3 ఎకరాలు రాయించుకురావాలని సుప్రియను రాఘవేందర్ రెడ్డి ఒత్తిడి చేయసాగాడు. 
 
ఇలా గొడవల్లో సాగుతోన్న రాఘవేందర్ రెడ్డి- సుప్రియ సంసారంలో గురువారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 11.30 గంటల సమయంలో సుప్రియ రెడ్డి ఉరేసుకున్నట్లు పక్కింటి వారు ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. సమయంలో రాఘవేందర్ రెడ్డి విధులకు వెళ్లాడు. తమ కుమార్తె రాత్రి 8 గంటల సమయంలో తమతో మాట్లాడిందని, ఆమె మృతిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశామని సుప్రియ రెడ్డి తండ్రి బుచ్చిరెడ్డి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్సీ వర్గీకరణపై ఎకసభ్య కమిషన్‌ను నియమించిన తెలంగాణ సర్కారు