Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుమానంతో భార్యను చంపి ముక్కలు చేసి ఉడకబెట్టిన భర్త... ఎముకలు రోట్లోదంచి...

Advertiesment
murder

ఠాగూర్

, గురువారం, 23 జనవరి 2025 (09:19 IST)
అనుమానం పెనుభూతమైంది. భార్యను హత్య చేసిన కిరాతక భర్త ఆమె శరీర భాగాలను ముక్కలు చేశాడు. వాటిని ఉడకబెట్టాడు. ఎముకలను మాత్రం రోట్లో వేసి దంచి నుజ్జు చేశాడు. వీటిని తీసుకెళ్ళి చెరువులో పడేశాడు. ఆ తర్వాత అత్తమామలతో కలిసి ఏమీ తెలియనట్టుగా తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ కేసులో కిరాతక చర్యకు పాల్పడిన భర్తనే పోలీసులు అనుమానించి కూపీలాగగా అసలు విషయం బయటపడింది. 
 
ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవి(35)కి అదే గ్రామానికి చెందిన పుట్ట గురుమూర్తి(39)తో 13 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ చేసి ప్రస్తుతం డీఆర్డీవోలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. 
 
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వరనగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఈ నెల 16న ఇంట్లో పిల్లలు లేని సమయంలో దంపతుల మధ్య తగాదా జరిగింది. సంక్రాంతి సెలవులకు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చే విషయంలో గొడవ మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురుమూర్తి భార్య తలపై రెండుసార్లు గట్టిగా కొట్టగా ఆమె స్పృహ తప్పి పడిపోయింది.
 
మరణించినట్లు భావించి మృతదేహాన్ని అదృశ్యం చేయాలనుకున్నాడు. మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో వేసి ఉడికించాడు. ఎముకలను వేరుచేసి రోట్లో వేసి పొడిగా మార్చాడు. ఎముకల పొడిని, శరీరం అవశేషాలను సమీపంలోని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. 
 
తప్పించుకోవడం కోసం ఈ నెల 18న అత్తమ్మ(భార్య తల్లి) సుబ్బమ్మకు ఫోన్ చేసి వెంకటమాధవి కనిపించడం లేదని, చిన్న గొడవై ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు. అతడి సూచనతో సుబ్బమ్మ తన కుమార్తె అదృశ్యమైనట్లు ఈనెల 18న మీర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఠాణాకు ఆమెతోపాటు గురుమూర్తి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
 
వెంకట మాధవి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆమె ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటకు వచ్చినట్లు ఆధారాలు లభించలేదు. గురుమూర్తి రాకపోకలు సాగిస్తున్న దృశ్యాలు మాత్రం రికార్డయ్యాయి. ఇంట్లోనే ఏదో జరిగిందనే కోణంలో అతడ్ని అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించగా హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. 
 
తొలుత పొంతనలేని సమాధానాలిచ్చిన నిందితుడు పలుమార్లు ప్రశ్నించిన తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు మృతదేహం ఆనవాళ్ల కోసం వెతుకున్నారు. కేవలం నిందితుడు చెప్పిన సమాచారంతోనే కాకుండా స్వీయ దర్యాప్తులో వెల్లడైన అంశాలను బేరీజు వేసుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమానం ఎక్కబోయే యువతి అండర్‌వేర్‌లో లైటర్స్: శంషాబాద్ విమానాశ్రయానికి రెడ్ అలెర్ట్