Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థిని బుగ్గ కొరికి ప్రధానోపాధ్యాయుడు.. చితక బాదిన స్థానికులు

Advertiesment
Head Master
, ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (12:03 IST)
చిన్నారులకు పాఠాలు చెప్పాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నాలుగో తరగతి చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ విద్యార్థిని దగ్గరకు తీసుకుని బుగ్గకొరికాడు. దీంతో ఆ బాలిక కేకలు వేయడంతో స్థానికులు పరుగుపరుగున వచ్చి ప్రధానోపాధ్యాయుడిని తరగతి గదిలోనే చితకబాదారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లా పిప్రి బహియార్‌లోని ప్రాథమిక పాఠశాలలో జరిగింది.
 
హెచ్ఎంను పాఠశాలలోనే బంధించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులతో పాటు స్కూలు వద్దకు చేరుకున్న బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు.. హెడ్మాస్టర్‌ను బయటకులాగి పోలీసుల ముందే కర్రలతో చితకబాదారు. 
 
ఆగ్రహంతో ఊగిపోయిన జనం నుంచి ప్రధానోపాధ్యాయుడిని కాపాడటం పోలీసులకు కష్టతరమైపోయింది. ఎలాగోలా వారి బారి నుంచి అతడిని తప్పించిన పోలీసులు.. స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
 
కాగా, హెడ్మాస్టర్‌ను చితకబాదిన వీడియోలు వైరల్ కావడంతో.. కటిహార్ ఏఎస్పీ రష్మి స్పందించారు. ఆ వీడియోలు ఇంకా తన దృష్టికి రాలేదని, ఒకవేళ అదే నిజమైతే దాడి చేసిన వారిపైనా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని ఆమె తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంపీటీసీ - జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు - వైకాపా బోణీ