Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరంగల్‌లో దారుణం : మత్తుమందిచ్చిన వివాహితపై అత్యాచారం

rape girl
, బుధవారం, 3 మే 2023 (12:01 IST)
వరంగల్‌ జిల్లాలోని హన్మకొండలో దారుణం జరిగింది. ఓ వివాహిత అత్యాచారానికి గురైంది. మత్తుమందు ఇచ్చి కొందరు దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని పైడిపల్లికి చెందిన వివాహిత ఒకరు హనుమకొండలోని ఓ కర్రీ పాయింట్‌లో పని చేస్తుంది. గత నెల 20వ తేదీన ఓ స్నేహితురాలు ఫోన్ చేసి పని ఉందని ఆరెపల్లికి రావాలని సూచన చేసింది. దీంతో భర్త తన బైకుపై తీసుకెళ్లి స్నేహితురాలి ఇంటి వద్ద వదిలిపెట్టి, ఆయన పనికి ఆయన వెళ్లిపోయారు. ఆమె వెళ్లిన కొద్దిసేపటికి ఓ కారు వచ్చి ఆగింది. 
 
అందులో నుంచి వచ్చిన రవి, డి.నాగరాజులు ఆమెను ఎక్కించుకుని ములుగు జిల్లా సరిహద్దుల వద్దకు వెళ్లిన తర్వాత మహిళా స్నేహితురాలు దిగిపోయింది. అక్కడ ఏ.రమేశ్, బి.లక్ష్మణ్, బి.సుధాకర్ అనే ముగ్గురు వ్యక్తులు కారులో ఎక్కారు. వీరంతా కలిసి ఆ మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, ములుగు నుంచి బస్సు ఎక్కించారు. 
 
ఆరెపల్లి వద్ద బస్సు దిగి భర్తకు ఫోన్‌ చేయగా.. ఎందుకు ఆలస్యమైందని మందలించారు. దాంతో ఆమె కరీంనగర్‌లోని రామడుగులో ఉండే తల్లి వద్దకు వెళ్లారు. రెండు, మూడు రోజులైనా భార్య ఇంటికి రాకపోవడంతో భర్త ఏప్రిల్‌ 25వ తేదీన ఎనుమాముల ఠాణాలో ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదైంది. ఈ క్రమంలో బాధితురాలు కులపెద్ద సహకారంతో భర్త వద్దకు వచ్చి... ఆయనకు విషయమంతా తెలిపింది. 
 
దాంతో ఏప్రిల్‌ 29న ఐదుగురు యువకులపై ఎనుమాముల స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు నిందితులపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు. బాధితురాలి స్నేహితురాలు పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృత్రి మేధతో పోలిస్తే మానవ మేథస్సే అగ్రస్థానం : ఏఐ పితామహుడు హింటన్