చర్చిలో పనిచేసే ఫాదర్ ను గుడ్డిగా నమ్మింది. రెండునెలల పాటు ఆమెతో సన్నిహితంగా మెలిగిన ఫాస్టర్ తనలోని కామాంధుడిని బయటకు తీశాడు. నువ్వు అందగత్తెవు. ప్రపంచంలోనే నీ అంత అందగత్తె ఎవరూ ఉండరు. అయితే నాదొక చిన్న విజ్ఞప్తి. కలిసి ఉందాం.. నిన్ను బాగా చూసుకుంటా. నిన్ను పెళ్ళి కూడా చేసుకుంటానని నమ్మించాడు. నమ్మి సర్వస్వం అర్పించింది. కానీ చివరకు అతని చేతిలో దారుణంగా మోసపోయింది.
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డి కుంటలో హోసన్నా చర్చిలో దారా నటానియే ఫాస్టర్‌గా ఉంటున్నారు. చుట్టుప్రక్కల ప్రాంతం నుంచి ప్రార్థనలు చేసేందుకు చాలామంది వస్తుంటారు. అయితే సరిగ్గా ఐదు నెలల క్రితమే సోని అనే యువతి పరిచయమైంది.
ఆమెకు ఫాదర్ అంటే ఎంతో గౌరవం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫాదర్ దగ్గరే ఉంటూ ప్రార్థనలు వింటూ ఉండేది. అతనికి సేవ చేసేది. అయితే ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలనుకున్నాడు ఫాదర్. సరిగ్గా రెండు నెలల క్రితమే ఆమెకు మాయమాటలు చెప్పాడు. నువ్వే నా ప్రాణం. నువ్వేంటే నాకు చాలా ఇష్టం. నువ్వు అందగత్తెవు. నీ కన్నా అందగత్తె ప్రపంచంలోనే ఉండదంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఇలా ఆమెతో సహజీవనం చేశాడు. ఫాదర్‌ను నమ్మిన ఆమె సర్వస్వం అర్పించింది.
వివాహం చేసుకోమని వారం రోజుల క్రితం నుంచి ఒత్తిడి తెస్తోంది సోని. అయితే ఈరోజు రేపు అంటూ మాట దాటవేస్తూ వచ్చాడు ఫాదర్. దీంతో తాను మోసపోయాయని భావించి పోలీసులకు ఆశ్రయించింది బాధితురాలు. రాతపూర్వకంగా ఫాస్టర్ పైన ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఫాదర్ పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.