భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం జట్టు స్కోరు 204 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు షమీ రెండు వికెట్లు తీసుకోగా, యాదవ్, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆస్ట్రేలియా ఆటగాళ్లు రోజర్ 57, వాట్సన్ 55, మార్ష్ 32 , వార్నర్ 0, పరుగులు చేసి పరుగులు చేసి ఔట్ ఆయ్యారు. ప్రస్తుతం స్మిత్ 40, బర్న్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగు టెస్టులతో కూడిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు జరిగిన మొదటి రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా విజయకేతనం ఎగుర వేసిన సంగతి తెలిసిందే.
మిగిలిన రెండు మ్యాచ్‌లు భారత జట్టుకు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.