భారత్‌తో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పర్యటన : షెడ్యూల్ వివరాలు
వచ్చే నెలలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో పర్యాటక జట్టు నాలుగు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు ట్వంటీ-20 మ్యాచ్‌లను ఆడనుంది. ఈ పర్యటనలో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 15 నుంచి 19 వరకు అహ్మదాబాద్‌లో జరుగనుంది. అలాగే, రెండో టెస్ట్ మ్యాచ్ ముంబైలో నవంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు, మూడో టెస్ట్ డిసెంబర్ ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు కోల్‌కతాలోనూ, చివరిదైన నాలుగో టెస్ట్ డిసెంబర్ 13 నుంచి 17 వరకూ నాగపూర్‌లో జరుగనుంది. ఇకపోతే.. ఐదు వన్డే మ్యాచ్‌లలో తొలి ట్వంటీ-20 మ్యాచ్ డిసెంబరు 20న పుణేలోనూ, 22వ తేదీన ముంబైలో రెండో టి-20 మ్యాచ్ ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత స్వదేశానికి చేరుకునే ఇంగ్లండ్ జట్టు మళ్లీ జనవరి నెలలో ఇంగ్లండ్‌కు వస్తుంది. అపుడు ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడుతుంది. ఇందులోభాగంగా జనవరి 11న రాజ్‌కోట్‌లో తొలి వన్డే మ్యాచ్ ఆడుతుంది. రెండో వన్డే 15న కొచ్చిలో, మూడో వన్డే 19న రాంచీలో నిర్వహిస్తారు. నాలుగో వన్డే 23న మొహాలీలో, ఐదో వన్డే 27న ధర్మశాలలో జరుగుతాయి.