అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు మరో ఆస్ట్రేలియా క్రికెటర్ గుడ్‌బై చెప్పారు. పరిమిత ఓవర్ల మ్యాచ్ స్పెషలిస్టు బౌలర్‌గా పేరుబడిన నాథన్ బ్రాకెన్ క్రికెట్‌కు స్వస్తి చెపుతున్నట్టు శనివారం సిడ్నీలో ప్రకటించారు. వెస్టిండీస్‌లో 2007 జరిగిన వన్డే ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన న్యూ సౌత్‌వేల్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.. 116 వన్డేలు, ఐదు టెస్టులు, 19 ట్వంటీ-20 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు.
ఆసీస్ పేసర్లలో మంచి బౌలర్‌గా గుర్తింపు పొందిన బ్రాకెన్‌కు 2009 సెప్టెంబరులో నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్ చివరిది. ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్న బ్రాకెన్ తన 33 యేళ్ళ వయస్సులో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రిటైర్మెంట్‌పై బ్రాకెన్ స్పందిస్తూ.. దేశీయంగా, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం సంతోషం కలిగించిందన్నారు. అయితే, మోకాలి గాయంతో రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందన్నాడు.