అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా పేసర్ నాథన్ బ్రాకెన్ స్వస్తి పలికాడు. గత ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడైన బ్రాకెన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి స్వయంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
మోకాలికి జరిగిన శస్త్ర చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పదలచుకున్నానని 33 ఏళ్ల బ్రాకెన్ మీడియాకు తెలిపాడు. వెస్టిండీస్‌పై 2001లో వన్డేల్లో అరంగేట్రం చేసిన బ్రాకెన్ ఇప్పటివరకూ 116 వన్డేలాడి 174 వికెట్లు పడగొట్టాడు.
ఇంకా ఐదు టెస్టులు, 19 టి 20 మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్రాకెన్ పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు సంపాదించాడు. కానీ మోకాలి గాయం కారణంగా జాతీయ జట్టుకు కొంతకాలం దూరంగా ఉన్నాడు. 2009 సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేనే బ్రాకెన్ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం.