Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌పై పాకిస్థాన్ విజయం... కాశ్మీర్‌లో సంబరాలు.. ఇదేమి చోద్యం!

చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను చిత్తుగా ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. దీంతో కాశ్మీర్ యువత సంబరాలు చేసుకున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుపై పాక్ విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుక

Advertiesment
Pakistan
, సోమవారం, 19 జూన్ 2017 (12:41 IST)
చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను చిత్తుగా ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. దీంతో కాశ్మీర్ యువత సంబరాలు చేసుకున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుపై పాక్ విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని కాశ్మీరీ యువత రెచ్చిపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. 
 
క్రికెట్ మ్యాచ్ ముగిసిన అనంతరం యువకులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. యువతకు తోడు మహిళలు కూడా వీధుల్లోకి రావడం విశేషం. శ్రీనగర్‌‌లోని పాతబస్తీలో ఫరా కాదల్‌, సెకిదాఫార్‌ ప్రాంతాల్లో సంబరాలు మిన్నంటాయి. 
 
కొంత మంది అత్యుత్సాహవంతులు బాణాసంచా కాల్చి సీఆర్ఫీఎఫ్‌ క్యాంపులు, స్థానిక పోలీస్‌ స్టేషన్లలోకి విసిరారు. అయితే భద్రతా సిబ్బంది సంయమనం పాటించారు. గతంలో ఎన్నడూలేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో యువకులు డప్పులు వాయించి సంబరాలు చేసుకున్నారు. 
 
ఇంకొన్ని చోట్ల భారత్ ఓటమిపాలు కావడాన్ని సగటు అభిమాని జీర్ణించుకోలేకపోయాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు పూజలు, హోమాలు చేసి సానుకూలంగా స్పందించారు. ఒకరి తర్వాత ఒకరు ఔట్ కావడంతో ఆశలన్నీ ఆవిరయ్యాయి. అప్పుడు కానీ ఓడిపోతున్నామని సగటు టీమిండియా అభిమాని నిర్ణయానికి రాలేకపోయాడు.
 
ఎవరో ఒకరు మెరుస్తారు. ఆకట్టుకుంటారు. జట్టుతో పాటు దేశాభిమానుల భావోద్వేగాలను గెలిపిస్తారని ఆశపడ్డారు. ఆశలన్నీ అడియాసలు కావడంతో అభిమానులు మండిపడ్డారు. మ్యాచ్ ఫిక్సైందన్నారు. పాక్ బౌలర్ల ప్రతిభను పట్టించుకోకుండా....తమ టీవీలు పగులగొట్టారు. టీమిండియా క్రికెటర్లను దూషించారు. చేతకాని వారంటూ విమర్శలు కురిపించారు. కాన్పూర్ అభిమానులు ఒక అడుగు ముందుకు వేసి టీమిండియా క్రికెటర్ల దిష్టిబొమ్మలు, పోస్టర్లు తగులబెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైన్యం తరపున పాక్ క్రికెటర్లకు తీర్థయాత్రలు : ఆర్మీ చీఫ్