Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీవాతో స్టెప్పులేసిన ధోనీ.. వీడియో చూడండి...

జీవాతో స్టెప్పులేసిన ధోనీ.. వీడియో చూడండి...
, మంగళవారం, 4 డిశెంబరు 2018 (12:42 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జీవాకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జీవా సోషల్ మీడియా సెలెబ్రిటీ. తాజాగా తన తండ్రి ధోనీతో జీవా చేసిన డ్యాన్సుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోకు భారీగా లైక్స్ వస్తున్నాయి.


ఈ వీడియోలో ధోనీ జీవాతో కలిసి డ్యాన్స్ చేస్తోంది. తండ్రికి డ్యాన్స్ స్టెప్పులు నేర్పిస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ వీడియో వైరల్ అవుతోంది. 
 
ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని బ్యాట్‌ను కాస్త పక్కనబెట్టి రాకెట్‌ పట్టాడు. క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించిన ధోనీ.. టెన్నిస్‌లోనూ సత్తా చాటాడు. రాంచీలోని జేఎస్‌సీఏ కంట్రీ క్రికెట్ క్లబ్‌ టెన్నిస్ టోర్నమెంట్‌ ధోనీ విజయం సాధించి.. టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం ధోని టెన్నిస్‌ కోర్టులో రాకెట్ పట్టుకుని ఆడుతున్నప్పటి ఫొటోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.
 
తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు ధోనీ జనవరిలో జట్టుతో కలవనున్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో తన కుమార్తెతో హ్యాపీగా వుంటున్న ధోనీ.. జీవాతో కలిసి డ్యాన్స్ స్టెప్పులు నేర్చుకున్నాడు. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Even better when we are dancing @zivasinghdhoni006

A post shared by M S Dhoni (@mahi7781) on


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిగ్గులేదా.. ప్రజలను మోసం చేసేందుకు నా పేరు వాడుకుంటారా?: సెహ్వాగ్