విరాట్ కోహ్లీతో రూ.110 కోట్ల డీల్.. ఎందుకో తెలుసా?
క్రికెట్ పరుగుల యంత్రం, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ భారీ డీల్ వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్రికెటర్‌తో ఓ కంపెనీ ఏకంగా రూ.110 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. ఆ కంపెనీ పేరు రూ.స్పోర్ట్స్ లైఫ
క్రికెట్ పరుగుల యంత్రం, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ భారీ డీల్ వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్రికెటర్‌తో ఓ కంపెనీ ఏకంగా రూ.110 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. ఆ కంపెనీ పేరు రూ.స్పోర్ట్స్ లైఫ్ స్టయిల్ బ్రాండ్ 'ప్యూమా'. ఈ ఒప్పంద కాలం ఎనిమిదేళ్లు.
ఈ ఒప్పందంలో భాగంగా ప్యూమాకు చెందిన వివిధ ప్రొడక్టులకు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ డీల్‌తో జమైకా స్ప్రింటర్ ఉస్సేన్ బోల్ట్‌తో పాటు అసాఫా పావెల్, థెర్రీ హెన్సీ, ఓలివర్ గిరౌడ్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్ల సరసన కోహ్లీ నిలిచాడు.
ఈ రూ.100 కోట్లకు అదనంగా, కోహ్లీ ప్రచారం చేసే బ్రాండ్ల అమ్మకాలపై రాయల్టీని కూడా ప్యూమా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ప్యూమాతో జత కట్టడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ బంధం దీర్ఘకాలం సాగాలని కోరుకుంటున్నానని తెలిపారు.