Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విరాట్ కోహ్లీ, అశ్విన్‌లు ఈ తరం క్రికెట్ దిగ్గజాలు: రాహుల్ ద్రవిడ్ కితాబు

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్‌లపై భారత అండర్‌-19జట్టుకు కోచ్‌గా సేవలు అందిస్తున్న మాజీ స్టార్ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస

విరాట్ కోహ్లీ, అశ్విన్‌లు ఈ తరం క్రికెట్ దిగ్గజాలు: రాహుల్ ద్రవిడ్ కితాబు
, శనివారం, 3 డిశెంబరు 2016 (16:01 IST)
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్‌లపై భారత అండర్‌-19జట్టుకు కోచ్‌గా సేవలు అందిస్తున్న మాజీ స్టార్ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుతమున్న టీమిండియా జట్టులో కోహ్లీ, అశ్విన్‌లు ఈ తరం క్రికెట్ దిగ్గజాలని కితాబిచ్చాడు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, అనిల్‌ కుంబ్లేతో పాటు తాను గతంలో క్రికెట్‌ను శాసించిన దిగ్గజాల జాబితాలో చేరతానని తెలిపిన ద్రవిడ్.. కోహ్లీ, అశ్విన్‌లు కూడా ఎప్పటికీ క్రికెట్‌ దిగ్గజాలని అన్నాడు. 
 
ఈ తరంలో కూడా భారత జట్టులో దిగ్గజాలు తయారవుతారని.. కోహ్లీ ఇప్పటికే క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడయ్యాడని.. అశ్విన్‌ టెస్టు రికార్డులను ఎవ్వరూ అధిగమించలేరని రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించాడు. రానున్న కాలంలో మరికొంతమంది అద్భుత ఆటగాళ్లను మనం చూడగలమన్నాడు. ప్రస్తుత కాలంలో టీవీ, సోషల్‌ మీడియా ద్వారా ప్రతిభ గల ఆటగాళ్లు త్వరగా వెలుగులోకి వస్తున్నారని ద్రావిడ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. \

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

200 మీటర్ల రికార్డును అధిగమించడం కష్టం.. కెరీర్‌ ముగిసే వేళాయే: ఉస్సేన్ బోల్ట్