నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలమన్నదే నా నినాదం: కోహ్లీ
కలలు కనండి, కలలను ప్రేమించండి, కలల్లో జీవించండి, కలలను సాఫల్యం చేసుకోండి అంటూ భారత అథ్లెట్లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విలువైన సూచన చేశాడు. శుక్రవారం జరిగిన ఆలిండియా సెంట్రల్ రెవెన్యూ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ
కలలు కనండి, కలలను ప్రేమించండి, కలల్లో జీవించండి, కలలను సాఫల్యం చేసుకోండి అంటూ భారత అథ్లెట్లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విలువైన సూచన చేశాడు. శుక్రవారం జరిగిన ఆలిండియా సెంట్రల్ రెవెన్యూ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ తమ కలలపై దృఢ నమ్మకంతో ఉండాలని, వాటిని సాకారం చేసుకునేందుకు అవిశ్రాంతంగా కృషి చేయాలని సూచించాడు. ‘ఒకవేళ నా మాటలు పనికొస్తాయనుకుంటే.. అథ్లెట్లందరికీ, ఇక్కడున్న వారికి నేను చెప్పేదొకటే. మీమీద మీకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలరు. నేను ఇదే నినాదంతో జీవిస్తున్నా. అలాంటి భావనతోనే ప్రతీ రోజూ నడుస్తున్నా. ఏదైనా సాధించాలన్న ఆలోచన ఉంటే.. దాన్ని అందుకోగలమని మిమ్మల్ని మీరు ఒప్పించుకోండి’ అని చెప్పాడు.
ఈ కార్యక్రమానికి హాజరైన భారత మహిళా రెజ్లర్లు బబిత ఫొగట్, గీతా ఫొగట్‌లను విరాట్ కొనియాడాడు. ‘ఇటీవలే ఈ అక్కాచెల్లెళ్ల సినిమా (దంగల్) చూశా. గుండెలను తాకింది. మొత్తం ఆరుగురు సోదరీమణులున్నా మీరిద్దరే (బబిత, గీత) సినిమాను నడిపించారు. దేశానికి ఎంతో కీర్తి ప్రతిష్ఠలు సాధించిపెట్టార’ని ప్రశంసించాడు. ‘జీవితంలో, ఆటలో దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలపండి. మీరు సాధించే విజయాలతో అందరూ గర్వపడేలా చేయండి. అందుకోసం నేను కూడా శక్తి మేరకు కృషి చేస్తాన’ని విరాట్ పిలుపునిచ్చాడు.