Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ తరహా పీఎస్ఎల్‌లో చైనా క్రికెటర్లు.. పాకిస్థాన్‌కు వస్తారట..

ముంబై పేలుళ్లకు అనంతరం భారత్.. పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడేందుకు ఇష్టపడలేదు. అలాగే 2009 లాహోర్‌‌లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన ఉగ్ర దాడి ఘటనకు తర్వాత ప్రపంచ దేశాలు కూడా పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు ఆ

ఐపీఎల్ తరహా పీఎస్ఎల్‌లో చైనా క్రికెటర్లు.. పాకిస్థాన్‌కు వస్తారట..
, సోమవారం, 21 ఆగస్టు 2017 (17:39 IST)
ముంబై పేలుళ్లకు అనంతరం భారత్.. పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడేందుకు ఇష్టపడలేదు. అలాగే 2009 లాహోర్‌‌లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన ఉగ్ర దాడి ఘటనకు తర్వాత ప్రపంచ దేశాలు కూడా పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపట్లేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టాలు తప్పలేదు. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలు మినహా భారత్‌లో ఇంతవరకు క్రికెట్ ఆడని పాకిస్థాన్‌కు చైనా ఊరటనిచ్చింది. 
 
చైనాతో పాకిస్థాన్‌కు ఉన్న సత్సంబంధాలను వినియోగించుకుని.. పాకిస్థాన్‌కు చైనా క్రికెటర్లు వచ్చి ఆడేందుకు సై అన్నారు. ఇప్పటికే ఇద్దరు చైనా క్రికెటర్లు వచ్చే ఏడాది జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో (పీఎస్ఎల్) పాల్గొనేందుకు అంగీకరించారు. దీంతో చైనాలోనూ క్రికెట్ ఆదరణ లభిస్తుందని భావిస్తోంది. తద్వారా పాకిస్థాన్-చైనాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపరిచినట్లు అవుతుందని క్రీడా పండితులు అంటున్నారు.  
 
ఇందులో భాగంగా, చైనా నేషనల్ క్రికెట్ టీమ్‌కి చెందిన ఇద్దరు ఆటగాళ్లు.. వచ్చే పీఎస్ఎల్‌లో పెషావర్ జాల్మి తరపున ఆడనున్నట్టు పాక్ అధికారిక పత్రిక ఏపీపీ వెల్లడించింది. చైనాలో క్రికెట్ వున్నా.. గుర్తించదగిన స్థాయిలో క్రికెటర్లు ప్రదర్శన చేయలేకపోతున్నారు. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో చైనాకు గుర్తింపు లభించట్లేదు.

అందుకే పాకిస్థాన్ స్వదేశీ టోర్నీలో చైనా క్రికెటర్లను బరిలోకి దించాలని చైనా భావిస్తోంది. ఇదిలా ఉంటే.. శ్రీలంక జట్టు ఈ ఏడాది సెప్టెంబరులో పాకిస్థాన్‌లో పర్యటించనుంది. తద్వారా 8 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో శ్రీలంక క్రికెట్ ఆడనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ హాకీ ప్లేయరైన భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. ఎక్కడ?