Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షమీ.. నీవు ముస్లింవేనా.. నీ భార్యను ఎలా ఉంచాలో నీకు తెలియదా? స్లీవ్‌లెస్ గౌనుపై నెటిజన్ల ఫైర్

భారత క్రికెటర్ మహ్మద్ షమీ చిక్కుల్లో పడ్డారు. ఆయన భార్య స్లీవ్‌లెస్ గౌను ధరించింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ముస్లిం మతపెద్దలతో పాటు.. నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘షమీ నీవ

Advertiesment
షమీ.. నీవు ముస్లింవేనా.. నీ భార్యను ఎలా ఉంచాలో నీకు తెలియదా? స్లీవ్‌లెస్ గౌనుపై నెటిజన్ల ఫైర్
, సోమవారం, 26 డిశెంబరు 2016 (13:21 IST)
భారత క్రికెటర్ మహ్మద్ షమీ చిక్కుల్లో పడ్డారు. ఆయన భార్య స్లీవ్‌లెస్ గౌను ధరించింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ముస్లిం మతపెద్దలతో పాటు.. నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘షమీ నీవు ముస్లింవేనా... భార్యను ఎలా ఉంచాలో నీకు తెలియదా... ఇలా ఫోటో పెట్టడం మంచిది కాదు’ అంటూ పలువురు షమీకి హితవు పలికారు.
 
తన అధికారిక ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీల్లో తన భార్య హాసిన్ జహాన్ మెరూన్ రంగు స్లీవ్‌లెస్ గౌను ధరించిన ఫోటోను ఈ నెల 23న షమీ పెట్టాడు. ముస్లిం సంప్రదాయ ప్రకారం పరదా ధరించకుండా ఇలాంటి ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడమేమిటని పలువురు ముస్లిమ్‌లు షమీపై విమర్శల గుప్పిస్తున్నారు. ‘నీకు సిగ్గు లేదా ఒక ముస్లిమ్ భార్యను ఎలా పరదా వెనుక ఉంచాలో నేర్చుకో...’ అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. 
 
‘నీ భార్యను ఇస్లామ్ సంప్రదాయం ప్రకారం నడుచుకునేలా చూడు షమీ అన్న’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘నీ భార్య ముస్లిమ్ లేక ఇతర మతస్థురాలా... కొంచెం దేవుడికి భయపడు’ అంటూ మరో నెటిజన్ పోస్టు చేశాడు. కాగా మోకాలి గాయం కారణంగా ఇంగ్లాండుతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ లకు దూరంగా ఉన్న షమి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. 
 
దీనిపై మరో క్రికెటర్ ముహమ్మద్ కైఫ్ షమీకి మద్ధతుగా నిలిచాడు. ‘‘షమీపై వ్యాఖ్యలు చూసి సిగ్గుపడుతున్నాను... దేశంలో చాలా సమస్యలున్నాయి’’ అని కైఫ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు దుస్తులు ధరిస్తారని, మీ పని మీరు చేసుకోండంటూ మరికొందరు నెటిజన్లు షమీకి బాసటగా నిలిచారు. ఫేస్‌బుక్‌లో షమీపై ఆగ్రహజ్వాలలు వక్తమవ్వగా, ట్విట్టర్‌‌లో మాత్రం మన భారతీయ ముస్లిమ్‌లు మీలాగే ఉండాలని ఎక్కువమంది అభిలషించారు. మొత్తం మీద షమీ పెట్టిన స్లీవ్ లెస్ ఫోటో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిటైర్మెంట్ ప్రకటించానా? ఎప్పుడు? దేశం కోసం ఆడుతున్నా.. పీసీబీ కోసం కాదు