Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గంగూలీ మాట విన్న కోహ్లీ.. అదరగొట్టిన ధోనీ

ధోనీకి తప్పకుండా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇస్తేనే మంచి ఫలితాలను ఆశించవచ్చునని భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేసి 24 గంటలయినా కాలేదు. బెంగళూరులో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ గంగూలీ ప్రతిపాదనను అమలు

గంగూలీ మాట విన్న కోహ్లీ.. అదరగొట్టిన ధోనీ
హైదరాబాద్ , గురువారం, 2 ఫిబ్రవరి 2017 (01:30 IST)
ధోనీకి తప్పకుండా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇస్తేనే మంచి ఫలితాలను ఆశించవచ్చునని భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేసి 24 గంటలయినా కాలేదు.  బెంగళూరులో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ గంగూలీ ప్రతిపాదనను అమలు చేశాడు. అద్భుత ఫలితాన్ని అందుకున్నాడు కూడా. అనూహ్యంగా నాలుగు పరుగులకే కోహ్లీ రనౌట్ కావడంతో మూగపోయిన స్టేడియం అటు ధోనీ, ఇటు రైనా మెరుపు బ్యాటింగ్‌తో పరవశించిపోయింది.
 
టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్లు సురేష్ రైనా (45 బంతుల్లో 63 2 ఫోర్లు, 5 సిక్సర్లు), మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(36 బంతుల్లో 56 5పోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా ఇంగ్లండుతో మూడో టి20 మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టపోయి 202 పరుగులు చేసింది. 
 
టీ20ల్లో తొలి హాఫ్ సెంచరీ చేశాడు ధోనీ. అయితే ఈ ఫార్మాట్లో తొలి హాఫ్ సెంచరీకి అత్యధిక మ్యాచ్‌లు (76) తీసుకున్న ఆటగాడిగా ధోనీ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ చెత్త రికార్డు ఐర్లాండ్‌ ప్లేయర్ గారీ విల్సన్ (38 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. అయితే ఈ మ్యాచ్‌లో టాప్‌ ఆర్డర్‌లో వచ్చిన ధోనీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
 
టీ20ల్లో పవర్ ప్లేలో మూడు సిక్సర్లు కొట్టిన రైనా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో రోహిత్ శర్మతో కలసి రెండో స్థానంలో నిలిచాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ 2009లో న్యూజిలాండ్ పై పవర్ ప్లేలో 4 సిక్సర్లు బాదేశాడు. 2016లో వెస్టిండీస్‌పై రోహిత్ 3 సిక్సర్లు కొట్టాడు. తాజాగా రైనా ఈ ఫీట్ నమోదుచేశాడు.
 
ధోనీకి తప్పకుండా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇస్తేనే మంచి ఫలితాలను ఆశించవచ్చునని గంగూలీ  తెలిపాడు. ఎందుకంటే అతడు మునుపటిలా కాకుండా ఇప్పుడు చాలా స్వేచ్చగా ఆడుతున్నాడు. అలాంటి సమయంలో కోహ్లీ అతడిని సరిగా ఉపయోగించుకుంటే జట్టు భారీ స్కోర్లు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు బౌలింగ్, ఫీల్డింగ్ విషయంలో కూడా ధోని సలహా తీసుకుంటే మంచిదని గంగూలీ వ్యాఖ్యానించాడు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిప్పేసిన చాహల్: సీరీస్ ఎగరేసుకుపోయిన భారత్