పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కరోనా నుంచి కోలుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ద్వారా ప్రకటించాడు. తనకు కరోనా సోకిందని గత నెల 13న అఫ్రిది ట్విటర్లో వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపాడు. తనతో పాటు తన భార్య, ఇద్దరు పిల్లలకు తాజాగా నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారణ అయినందని తెలిపాడు.
తన భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు. తామంతా క్షేమంగా వున్నామని.. తమ కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతానికి కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపే సమయం వచ్చిందని అఫ్రిది ట్వీట్ చేశాడు.