యువ క్రికెటర్లు మైదానంలో పలు ఆసక్తికర రికార్డులను నెలకొల్పుతున్నారు. తాజాగా ఆప్ఘనిస్థాన్ బౌలర్ ఈ తరహా రికార్డును సృష్టించాడు. టీ20ల్లో ఏకంగా 100 బంతులు సంధించి ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా రికార్డు సృష్టించాడు. ఆ బౌలర్ పేరు రషీద్ ఖాన్. ఏకంగా మూడు టీ20 మ్యాచ్‌లలో ఈ రికార్డును నమోదు చేశాడు.
ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లో సిరీస్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ జట్టుపై ఆప్ఘనిస్థాన్ ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఏకంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నాడు బలమైన పాకిస్థాన్పై సిరీస్ గెలుపుతోపాటు ఆప్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్ ఈ అరుదైన రికార్డును కూడా నమోదు చేశాడు.
సాధారణంగా టీ20 మ్యాచ్‌లంటేనే బ్యాటర్లు మైదానంలో చెలరేగిపోతుంటారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటారు. ఒక్క బౌలర్ వేసే నాలుగు ఓవర్లలో కనీసం ఒక్క ఫోర్లు, ఒక్క సిక్సర్ అయినా బాదేందుకు ప్రయత్నిస్తారు. ఒక్కో ఓవర్‌కు 24 బంతులు. కానీ. రషీద్ ఖాన్ వరుసగా ఆడిన ఐదు మ్యాచ్‌లలో వంద బంతులు వేసి ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం గమనార్హం.