Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిక్సింగ్ కేసులో ఐదేళ్ల నిషేధం.. కానీ ప్రేమించిన క్రికెటర్నే పెళ్లాడిన నర్జిస్

బ్రిటీష్- పాకిస్థానీ యువతి నర్జిస్‌తో పాకిస్థాన్ స్టార్ బౌలర్ మహమ్మద్ అమీర్ వివాహం జరిగింది. మంగళవారం లాహోర్‌లో జరిగిన వీరి వివాహానికి పలువురు పాకిస్థాన్ క్రికెటర్లు హాజరయ్యారు. సోమవారం మెహందీ వేడుక న

Advertiesment
Pakistani pacer Mohammed Amir ties the knot with Narjis in Lahore
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (12:57 IST)
బ్రిటీష్- పాకిస్థానీ యువతి నర్జిస్‌తో పాకిస్థాన్ స్టార్ బౌలర్ మహమ్మద్ అమీర్ వివాహం జరిగింది. మంగళవారం లాహోర్‌లో జరిగిన వీరి వివాహానికి పలువురు పాకిస్థాన్ క్రికెటర్లు హాజరయ్యారు. సోమవారం మెహందీ వేడుక నిర్వహించారని స్థానిక మీడియా వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో రిసెప్షన్, వలీమా ఏర్పాటు చేశారని తెలిపింది.
 
ఆరేళ్ల క్రితం ఆమిర్‌ను లండన్‌లో నర్జిస్ కలిసింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నర్జిస్‌తో మహమ్మద్ అమీర్‌ల నిశ్చితార్థం 2014లో జరిగింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అమీర్ ఐదేళ్లు నిషేధం ఎదుర్కొన్నా నర్జిత్ అతడినే పెళ్లాడింది. తనది ప్రేమ వివాహం అని, తమ పెళ్లికి ఇరు కుటుంబాలు సంతోషంగా అంగీకరించాయని అమీర్ వెల్లడించారు.
 
కాగా అమీర్ 18 టెస్టులాడాడు. ఇందులో 63 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 22 మ్యాచ్‌లాడిన ఇతను.. 35 వికెట్లు సాధించాడు. ఇక ట్వంటీ-20 ఫార్మాట్‌లో 30 మ్యాచ్‌లు ఆడిన అమీర్ 34 వికెట్లు నేలకూల్చాడు. కానీ స్పాట్ ఫిక్సింగ్ ఐదేళ్ల నిషేధంలో ఉన్న అమీర్.. ఈ ఏడాది లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌లో ఆడనున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు రిటైర్మెంట్ ఆలోచన లేదన్న సచిన్‌కు గెంటేస్తామని చెప్పేశాం : సందీప్ పాటిల్