ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఫిక్సింగ్.. అందుకే ఫైనల్‌కు పాకిస్థాన్ : ఆరోపణలు చేసిన పాక్ దిగ్గజ క్రికెటర్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ జట్టు తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య పటిష్టమైన ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ విజయంపై పాకిస్థాన్ క్రికెట
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ జట్టు తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య పటిష్టమైన ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ విజయంపై పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం అమీర్ సోహైల్ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ జట్టు ఛాంపియన్స్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని ఆరోపించాడు.
ఆయన ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన ఆరోపణలు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ అన్ని మ్యాచ్‌లను కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ ఫిక్స్ చేశాడని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్‌లో బయటిశక్తులు కూడా పని చేశాయని చెప్పాడు. అక్రమ మార్గంలో పాక్ ఫైనల్ చేరిందని అమీర్ సొహైల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి 1990లో అరంగేట్రం చేసి, పదేళ్లపాటు ఆ జట్టుకి ఓపెనర్‌గా సేవలందించి, ఎన్నో విలువైన ఇన్నింగ్స్ ఆడిన పాక్ దిగ్గజ ఓపెనర్ అమీర్ సొహైల్ ఈ తరహా ఆరోపణలు చేయడంతో క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడింది. కాగా, గతంలో ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా పాక్ జట్టులో స్పాట్ ఫిక్సింగ్ జరిగిన విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో ఇంగ్లండ్ పటిష్టమైన జట్టు ఓటమిపాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.