Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సొంతగడ్డపై అవమానకరంగా చిత్తైన పాకిస్థాన్... చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్!

bangladesh cricket team

ఠాగూర్

, సోమవారం, 26 ఆగస్టు 2024 (12:17 IST)
సొంత గడ్డపై పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. అదేసమయంలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రను లఖించింది. పాకిస్థాన్‌ క్రికెట్ జట్టును ఆ దేశ సొంత గడ్డపైనే చిత్తుగా ఓడించింది. తద్వారా పాకిస్థాన్ తొలి విజయాన్ని రుచిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ భారీ స్కోరు సాధించి ఇన్నింగ్స్ డిక్లేర్ ప్రకటించి అనూహ్య రీతిలో ఓటమి పాలుకావడం ఆతిథ్య జట్టుకు అవమానకరంగా మారింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ ఆధిక్యాన్ని సాధించడం పాక్ ఆటగాళ్లను షాక్‌కు గురిచేస్తోంది. నిజానికి తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు భారీ స్కోర్లు సాధించడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసేలా కనిపించింది. అయితే చివరి రోజున రెండో ఇన్నింగ్స్ పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలడంతో మ్యాచ్ అనూహ్య మలుపు తిరిగింది. 
 
పాకిస్థాన్ జట్టును బంగ్లాదేశ్ బౌలర్లు కేవలం 146 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో విజయానికి అవసరమైన 30 పరుగులను బంగ్లా బ్యాటర్లు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించారు. స్వదేశంలో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం పాక్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతేకాదు మరో చెత్త రికార్డు కూడా పాకిస్థాన్ పేరిట నమోదైంది. స్వదేశంలో ఒక వేదికలో ఆడిన రెండు వరుస మ్యాచ్ 400లకుపైగా స్కోర్లు సాధించినప్పటికీ, ఆ మ్యాచ్ ఓటమిపాలైన తొలి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. ఈ ఓటమి కంటే ముందు.. డిసెంబరు 2022లో ఇదే రావల్పిండి వేదికగా ఇంగ్లండ్ చేతిలో పాక్ అనూహ్యంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ పాక్ 579 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ ఆ జట్టు అనూహ్యంగా ఓడిపోయింది. 
 
కాగా, రావల్పిండి టెస్టులో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ సౌద్ షకీల్ 141, మహ్మద్ రిజ్వాన్ 171 పరుగులు సాధించడంతో 448/6 భారీ స్కోర్ వద్ద పాకిస్థాన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అయితే బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫీకర్ 191 పరుగులతో చెలరేగడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 565 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ అద్భుతమైన బౌలింగ్ పాకిస్థాన్ 146 పరుగులకే ఆలౌట్ అవడంలో కీలక పాత్ర పోషించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నీ ఫార్మాట్‌లకు బైబై చెప్పేసిన శిఖర్ ధావన్.. ఆ శాంతితో వెళ్తున్నా...