Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టూపీస్ బికినీతో షూటింగ్ చేసినప్పుడూ పేరెంట్స్ నాతోనే ఉన్నారు: ఆకాంక్ష శర్మ

టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన టాప్‌ మోడల్‌ ఆకాంక్ష శర్మ తన కుటుంబ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మీడియాతో పంచుకున్నారు. తాను మోడల్ ర

Advertiesment
'My parents were quite okay when I did a bikini shoot'
, సోమవారం, 21 నవంబరు 2016 (11:36 IST)
టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన టాప్‌ మోడల్‌ ఆకాంక్ష శర్మ తన కుటుంబ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మీడియాతో పంచుకున్నారు. తాను మోడల్ రంగంలో రాణించేందుకు తన తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభించడమే కారణమని తెలిపింది. మిగతా మోడల్స్‌ లాగా తాను ఏజెన్సీల చుట్టూ తిరగలేదని, ఫేస్‌ బుక్‌ ఫ్రొఫైల్‌ చూసి వాళ్లే (ఇండియాస్‌ నెక్స్ట్ టాప్‌ మోడల్‌ నిర్వాహకులు) తనను సంప్రదించారని ఆకాంక్ష తెలిపారు. 
 
ఆ షోలో భాగంగా టూపీస్‌ బికినీతో షూటింగ్‌ చేసినప్పుడూ పేరెంట్స్‌ తనతోనే ఉన్నారని, ఆ దుస్తులు ధరించడంపట్ల తల్లిదండ్రులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని.. అమ్మానాన్నల ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి స్కూల్, కాలేజీల్లో యాక్టివ్‌గా అమ్మానాన్నల ప్రోత్సాహంతో పైకొచ్చానని ఆకాంక్ష పేర్కొన్నారు.  
 
ప్రస్తుతం ఢిల్లీలో ఆర్కిటెక్చర్‌ కోర్సు చేస్తున్నానని, ముంబై నుంచి అవకాశాలు వెల్లువలా వస్తున్నా చదువు పూర్తయ్యేదాక సొంత ఊరిని విడిచిపెట్టనని ఆకాంక్ష వెల్లడించారు. నెల రోజుల కిందట బిగ్‌ బాస్‌ షోలో ఆకాంక్ష మాట్లాడుతూ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ సోదరుడు జోరావర్‌‌తో పెళ్లి పెటాకులు కావడానికి కారణం అతని తల్లేనని ఆరోపించిన సంగతి తెలిసిందే. విడిపోయిన తర్వాత భరణంగా నెలకు రూ.3 వేలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. ఈ వ్యాఖ్యలను యువీ కుటుంబీకులు తీవ్రంగా ఖండించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా సూపర్ సిరీస్ విజేతగా పీవీ సింధు: కెరీర్‌లో తొలిసారి.. సూపర్ సిరీస్ టైటిల్