క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్. అక్టోబరులో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీతో భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ పునరాగమనం చేసే అవకాశం వుంది. ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా వున్న షమీ.. రంజీ ట్రోఫీతో మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.
గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన షమీ.. స్వదేశంలో జరిగిన మెగా ఈవెంట్‌లో చీలమండకు గాయం కావడంతో ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే చికిత్స కోసం లండన్ కూడా వెళ్లాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బెంగాల్ ఫాస్ట్ బౌలర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసంలో ఉన్నాడు.
అక్టోబరు 11న ఉత్తరప్రదేశ్‌తో జరిగే తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో, కోల్‌కతాలో అక్టోబరు 18న బీహార్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో ఆడవచ్చు. అలాగే, రాబోయే న్యూజిలాండ్ పర్యటన క్రమంలో భారత మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఒకదానిని కూడా ఆడవచ్చు.