ధోనీని విమర్శించేముందు వెనక్కి తిరిగి చూసుకోండి: రవిశాస్త్రి
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి జట్టు కోచ్ రవిశాస్త్రి మద్దతు పలికాడు. గురువారం నుంచి శ్రీలంకతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. రవిశాస్త్రి కోచ్‌గా బాధ్యతలు చే
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి జట్టు కోచ్ రవిశాస్త్రి మద్దతు పలికాడు. గురువారం నుంచి శ్రీలంకతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. రవిశాస్త్రి కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో తొలి టెస్ట్ సిరీస్ ఇదే. ఈ నేపథ్యంలో దేశానికి రెండు ప్రపంచ కప్‌లు సాధించిపెట్టిన ధోనీని విమర్శించే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి తమ కెరీర్ చూసుకోవాలని చురకలంటించారు.
జట్టుకు ధోనీ చేసిన సేవలు అమూల్యమైనవని.. దిగ్గజ ఆటగాడికి అండగా నిలవాల్సిన సమయం ఇదని తెలిపాడు. మైదానంలో ధోనీ కంటే మెరుగైన ఆటగాడ కనిపించడన్నాడు. బ్యాట్స్‌మెన్‌గా, కీపర్‌గా అతడి ప్రదర్శన అద్భుతమని కొనియాడాడు.
కాగా ఇటీవల కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన ధోనీపై విమర్శలు వెల్లువెత్తాయి. టీ20కి ధోనీ ఆటతీరు సరిపోదని, ఈ ఫార్మాట్ నుంచి ధోనీ తప్పుకుని యువకులకు చోటిస్తే మంచిదని వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ వంటివారు సూచించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో ధోనీకి కెప్టెన్ కోహ్లీ, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సహా పలువురు ధోనీకి మద్దతు పలికారు. ధోనీని విమర్శించిన వారిపై దుమ్మెత్తిపోశారు. తాజాగా ధోనీకి రవిశాస్త్రి అండగా నిలిచాడు.