ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ పోటీలకు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోలో బోర్డు ఆదివారం రిలీజ్ చేసింది. ఈ మెగా లీగ్ టోర్నీ ఈ నెల 26వ తేదీన ప్రారంభంకానుంది.
కరోనా పరిస్థితుల కారణంగా ఈ టోర్నీలో జరిగే అన్ని మ్యాచ్‌లను రెండు వేదికల్లోనే నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని ముంబైలోని మూడు, పూణెలోని ఓ స్టేడియంతో కలుపుకుని మొత్తం నాలుగు స్టేడియాల్లో నిర్వహిస్తారు.
ఐపీఎల్ 15వ సీజన్‌లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి మొత్తం 65 రోజుల పాటు ఈ మ్యాచ్‌లు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతుంది. ఇది వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. చివరి లీగ్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగనుంది.
ముంబై వాంఖడే స్టేడియంలో 20 మ్యాచ్‌లు డీవై పాటిల్ స్టేడయంలో 20, బ్రాబౌర్న్ స్టేడియంలో 15, పూణేలోని ఎంసీఏ మైదానంలో 15 మ్యాచ్‍ల చొప్పున నిర్వహిస్తారు.
అలాగే, ఈ దఫా కూడా డబుల్ హైడర్లు (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) నిర్వహిస్తారు. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైతే రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ మే 29వ తేదీన నిర్వహిస్తారు.