ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం పాటలు ఈ నెల 12, 13వ తేదీల్లో జరుగనున్నాయి. ఇందులో 590 మంది ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉండనున్నారు. బెంగళూరులో జరిగే ఈ మెగా వేలంలో అనేక మంది తెలుగు క్రికెటర్లు కూడా ఉన్నారు.
ఈ వేలం పాటలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరుగనుంది. ఐపీఎల్ సీజన్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న విషయం తెల్సిందే. ఇందుకోసం ఆటగాళ్లను లక్షల్లో చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. తద్వారా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా ఐ.పి.ఎల్. ఈ సిరీస్‌లో ఆడేందుకు క్రికెటర్లు అమిత ఉత్సాహం చూపుతారు.
గతేడాది వరకు 8 జట్లు ఆడుతూ వచ్చాయి. ఈ యేడాది మరో రెండు జట్లను చేర్చారు. ఇలా ఆటగాళ్లందరూ కొత్తగా వేలం వేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 8 జట్లు ఒక్కొక్కరు 4 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. కొత్త జట్లు నలుగురు ఆటగాళ్లను కూడా ఉంచుకోవచ్చు. మిగిలిన ఆటగాళ్లను బహిరంగ వేలం ద్వారా వేయనున్నారు.