Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పుడు.. ఇప్పుడు! క్రిస్‌గేల్‌తో హ్యాట్రిక్ కుర్రాడు

Advertiesment
అప్పుడు.. ఇప్పుడు! క్రిస్‌గేల్‌తో హ్యాట్రిక్ కుర్రాడు
, శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (16:07 IST)
ప్రస్తుతం ఐపీఎల్‌లో మార్మోగిపోతున్న పేరు సామ్ కర్రాన్.. ఈ యువకెరటం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి ఓటమి దిశగా సాగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు విజయాన్ని అందించాడు. కొన్నేళ్ల క్రితం విండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్‌గేల్‌తో సామ్ దిగిన ఫొటోను ప్రస్తుతం గేల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. 
 
ప్రస్తుతం క్రిస్‌గేల్ మరియు కర్రన్ ఇద్దరూ పంజాబ్ జట్టులో ఉండటం విశేషం. ఢిల్లీతో మ్యాచ్‌లో క్రిస్‌గేల్‌ను పక్కన పెట్టడంతో కర్రన్ తుదిజట్టులోకి వచ్చాడు. సామ్ కర్రాన్ పాఠశాలకు వెళ్లే వయసులో స్కూల్ యూనిఫాంలో ఉన్నప్పుడు కొన్నేళ్ల క్రితం గేల్‌పై అభిమానంతో ఫోటో దిగాడు. తాజాగా ఐపీఎల్‌లో పంజాబ్‌కు ఆడుతుండగా గేల్‌తో మరోసారి యువ క్రికెటర్ ఫోటో దిగాడు. ఈ రెండు ఫోటోలను జతచేసిన గేల్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అప్పుడు.. ఇప్పుడు సామ్ భలే ఉన్నాడని కామెంట్ చేస్తున్నారు.
 
తనదైన స్వింగ్ బౌలింగ్‌తో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ నడ్డివిరుస్తూ పంజాబ్‌కు అద్భుత విజయాన్ని అందించిన కర్రాన్‌కు అసలు హ్యాట్రిక్ కొట్టినట్లు తెలియదని త‌ర్వాత వెల్ల‌డించాడు. 167 పరుగుల లక్ష్యఛేదనలో 144/3 స్కోరుతో గెలుపు దిశగా సాఫీగా సాగుతున్న ఢిల్లీని కర్రాన్ హ్యాట్రిక్‌తో కుప్పకూల్చిన సంగతి తెలిసిందే. 
 
ఈ యంగ్ స్పీడ్‌స్టర్‌కు తోడు మహ్మద్ షమీ విజృంభణతో ఢిల్లీ ఎనిమిది పరుగుల తేడాతో ఆఖరి ఏడు వికెట్లు కోల్పోయి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసు(20 ఏళ్లు)లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కిన కర్రాన్‌ను పంజాబ్ వేలంలో రూ.7.2 కోట్లకు సొంతం చేసుకున్నది తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైలో 3/34.. పల్లెకెలెలో 7/49.. ఎలా సాధ్యమైంది..?