Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత దేశం గురించి భారతీయులకు తెలుసు.. సచిన్ సంచలన వ్యాఖ్యలు

Advertiesment
Indians
, బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (20:56 IST)
రైతు ఉద్యమం నేపథ్యంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మనమంతా ఓ దేశంగా సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారత దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలుగకూడదని హెచ్చరించారు. 
 
బాహ్య శక్తులు కేవలం ప్రేక్షకులుగానే ఉండాలని, మన దేశ వ్యవహారాల్లో భాగస్వాములు కారాదని స్పష్టం చేశారు. భారత దేశం గురించి భారతీయులకు తెలుసునని, భారత దేశం కోసం ఏ నిర్ణయమైనా భారతీయులే తీసుకోవాలని పేర్కొన్నారు.
 
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమంపై ఇతర దేశాల వారు కూడా స్పందిస్తున్నారు. పాప్ సింగర్ రిహన్నా, పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్‌బర్గ్ స్పందించడంతో, రైతులకు ప్రపంచం వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో స్పందించారు. 
 
భారత్‌లో రైతు ఉద్యమానికి సంబంధించిన ఓ ఆర్టికల్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన రిహన్నా ''మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవడం లేదు?'' అని ప్రశ్నించారు. ముఖ్యంగా రిహాన్నా ట్వీట్‌కు సచిన్ కౌంటరిచ్చారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయదేవ్ ఉనద్కట్‌కు డుం డుం డుం.. రినీ కంటారియా అనే యువతితో..?