Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైదానంలో హాయిగా కునుకు తీసిన ధోనీ.. వీడియో చూడండి..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంత ఒత్తిడిలోనూ కూల్‌గా వుంటాడని తెలిసిందే. కెప్టెన్సీ నుంచి దూరమైనా తాను కూల్ కెప్టెన్‌‌నేనని ధోనీ మరోసారి నిరూపించుకున్నాడు. మ్యాచ్ జరుగుతుండగా బ్యాటింగ్‌క

మైదానంలో హాయిగా కునుకు తీసిన ధోనీ.. వీడియో చూడండి..
, సోమవారం, 28 ఆగస్టు 2017 (12:22 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంత ఒత్తిడిలోనూ కూల్‌గా వుంటాడని తెలిసిందే. కెప్టెన్సీ నుంచి దూరమైనా తాను కూల్ కెప్టెన్‌‌నేనని ధోనీ మరోసారి నిరూపించుకున్నాడు. మ్యాచ్ జరుగుతుండగా బ్యాటింగ్‌కు దిగిన ధోనీ మైదానంలో నిద్రపోయాడు. కాసేపు హాయిగా నిద్రపోయి సేద దీరాడు. ఇదేంటి? కూల్ కెప్టెన్ అంటూ పొగిడి మైదానంలో ధోనీ నిద్రపోవడం ఏంటి? అనే డౌట్ మీకుంటే.. ఈ కథనం చదవాల్సిందే. 
 
శ్రీలంక నిర్దేశించిన 218 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 44 ఓవర్లలో 210 పరుగులు చేసింది. అప్పటికి రోహిత్ శర్మ (122), ధోనీ (61) క్రీజులో ఉన్నారు. శ్రీలంక ఓటమి ఖరారు కావడంతో తట్టుకోలేని లంక అభిమానులు స్టేడియంలోకి బాటిళ్లు విసిరారు. నానా హంగామా చేశారు. దీంతో ఆటకు అంతరాయం కలిగింది. 
 
గ్రౌండ్‌లోని బాటిళ్లను సిబ్బంది తొలగించిన తర్వాత కూడా మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న విషయంలో క్లారిటీ రాలేదు. అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేయడంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. కానీ ధోనీ మాత్రం మైదానంలో కునుతు తీశాడు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత విజయానికి అవసరమైన 8 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని సంపాదించి పెట్టాడు. ట్విట్టర్లో ధోనీ ఫీల్డులోనే కునుకు తీసిన వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
 
మరోవైపు ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంక‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో శ్రీలంక‌పై భార‌త్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వ‌న్డేల సిరీస్‌ను 3-0తో భార‌త్ కైవ‌సం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మ‌న్ రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ చేశాడు. భార‌త్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ 124, దోనీ 67, రాహుల్ 17, శిఖ‌ర్ ధావ‌న్ 5, కోహ్లీ 3 ప‌రుగులు చేశారు.
 
సిరీస్ కాపాడుకోవాలంటే త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సిన మ్యాచ్ ఇది కావడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక‌. మూడో వ‌న్డేలోనూ టీమిండియా బౌలింగ్ ధాటికి శ్రీలంక నిల‌బ‌డ‌లేక‌పోయింది. మొత్తం టూర్‌లో తొలిసారి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 217 ప‌రుగులే చేయ‌గ‌లిగింది. పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి లంక‌ను దెబ్బ‌తీశాడు. వ‌న్డేల్లో ఐదు వికెట్లు తీసుకోవ‌డం బుమ్రాకు ఇదే తొలిసారి. తిరిమానె (80) ఒక్క‌డే భార‌త బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నాడు. 
 
ఓపెన‌ర్ చండీమాల్ 36 ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించాడు. భారత బౌలర్లలో పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్‌, కేదార్ జాద‌వ్ త‌లా ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన భారత్ 4 వికెట్ల న‌ష్టానికి 45.1 ఓవ‌ర్ల‌లో 218 పరుగులు చేసింది. తద్వారా గెలుపును నమోదు చేసుకుని సిరీస్‌ను కైవసం చేసుకుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో పీవీ సింధు అదుర్స్.. ఫైనల్లోకి ఎంట్రీ.. సైనా నెహ్వాల్ అవుట్..