Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాంచీ టెస్ట్ మ్యాచ్ : భారత్ విజయం.. టెస్ట్ సిరీస్ కైవసం

gill - jurel

వరుణ్

, సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (13:51 IST)
రాంచీ వేదికగా పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 191 పరుగుల విజయలక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ 55, జైస్వాల్ 37, శుభమన్ గిల్ 52 (నాటౌట్), రవీంద్ర జడేజా 4, జురెల్ ధ్రువ్ 39 (నాటౌట్) చొప్పున పరుగులు చేయగా, పటీదార్, సర్ఫరాజ్ ఖాన్‌లు డకౌట్ అయ్యారు. ముఖ్యంగా, లక్ష్య ఛేదనలో భాగంగా, మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 40/0తో నాలుగో రోజు ఉదయం ఆటను ప్రారంభించిన రోహిత్ శర్మ, జైస్వాల్‌లు మరో 44 పరుగులు జోడించిన తర్వాత జైస్వాల్ ఔట్ అయ్యారు. 
 
ఆ తర్వాత జట్టు స్కోరు 99 పరుగుల మీద ఉండగా రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. అలా క్రమం తప్పకుండా వికెట్లు పడిపోయాయి. ఒక దశలో 120 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్నట్టు కనిపించిన భారత్‌ను గిల్, ధ్రువ్‌లు విజయతీరానికి చేర్చారు. వీరిద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించారు. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో గెలుచుకుంది. మరో టెస్ట్ మ్యాచ్ జరగాల్సివుంది. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ ధ్రువ్ 90 పరుగులు చేసి జట్టును ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు. ఇంగ్లండ్ జట్టులో తొలి ఇన్నింగ్స్‌లో జో టూర్ 122 పరుగులతో సెంచరీ చేశాడు.
 
ఇరు జట్ల సంక్షిప్త స్కోర్ వివరాలు... 
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 353 రన్స్
భారత్ తొలి ఇన్నింగ్స్ 307 రన్స్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 145 రన్స్
భారత్ రెండో ఇన్నింగ్స్ 192/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్ ఖాతాలో అరుదైన రికార్డు... ఏకైక బౌలర్‌గా...