Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాంచెష్టర్‌లో వర్షం పడాలని కోరుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

Advertiesment
మాంచెష్టర్‌లో వర్షం పడాలని కోరుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
, సోమవారం, 8 జులై 2019 (16:24 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, మంగళవారం మాంచెష్టర్ వేదికగా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం అటు కోహ్లీ సేన, ఇటు కివీస్ జట్లు సమాయత్తమయ్యాయి. 
 
అయితే, ఈ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగే మాంచెష్టర్‌లో మంగళవారం వర్షంపడే అవకాశాలు ఉన్నట్టు బ్రిటన్ వాతావరణ శాఖ చెపుతోంది. మంగళవారం నాటి మ్యాచ్‌కు తేలికపాటి జల్లులు అంతరాయం కలిగించవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
అయితే రేపు జరిగేది సెమీ ఫైనల్ కనుక దానికి ఎలాగూ బుధవారం రిజర్వ్ డే ఉంది. ఈ క్రమంలో రేపు వర్షం కారణంగా ఆటను కొనసాగించలేకపోతే.. బుధవారం రోజున అక్కడి నుంచే ఆటను ప్రారంభిస్తారు. అయితే రేపటి కన్నా బుధవారమే ఇంకా ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 
 
ఈ క్రమంలో వరుసగా రెండు రోజులూ వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే పరిస్థితి ఏమిటని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ రెండు రోజులూ వర్షం కారణంగా ఆట జరగకపోతే అభిమానులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన పనిలేదు. అది టీమిండియాకే లాభిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
అదెలాగంటే.. వర్షం వల్ల రెండు రోజులూ ఆట జరగకుండా మ్యాచ్ రద్దయితే.. లీగ్ దశలో అధిక పాయింట్లు సాధించిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఈ లెక్కన చూస్తే.. భారత్, న్యూజిలాండ్ జట్లలో భారత్‌కు అధిక పాయింట్లు (15) ఉన్నాయి కనుక.. టీమిండియానే ఫైనల్‌కు వెళ్తుంది. 
 
అయితే సెమీ ఫైనల్ మ్యాచ్ టై అయితే మాత్రం సూపర్ ఓవర్ ద్వారా విన్నర్‌ను నిర్ణయిస్తారు. అందుకే భారత క్రికెటర్లు మాత్రం వర్షం పడాలని కోరుకుంటున్నారు. కాగా, లీగ్ దశలో న్యూజిలాండ్- భారత్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా రద్దు అయిన విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెమీస్ మ్యాచ్ నల్లేరుపై నడక కాదు... ఇలా చేస్తేనే గెలుపు : సచిన్