మాజీ వెస్టిండీస్ క్రికెటర్ టైనో బెస్ట్ దగ్గరదగ్గరా 650 మంది వరకు అమ్మాయిలతో సెక్స్‌లో పాల్గొన్నాడట. తాను వెళ్లిన ప్రతిచోటల్లా తనకు కనిపించే అందమైన అమ్మాయిలతో పడక సుఖం అనుభవించేవాడట. విజయవంతంగా బెడ్‌పై వారితో శృంగారంతో ముగుస్తుందని ఇతగాడు బహిరంగంగా చెప్పడం క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపింది. విండీస్‌కు 25 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన అత్యుత్తమ ప్రదర్శనతో మైదానంలో రాణించలేక పోయినప్పటికీ... రసికానుభవాల్లో మాత్రం ఆరితేరాడు. ''మైండ్ ద విండోస్: మై స్టోరీ'' అన్న పేరుతో వస్తోన్న తన పుస్తకంలో తన శృంగార జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఆ పుస్తకంలో వెల్లడించిన విషయాలేంటంటే....
క్రికెట్ ఆడటం కంటే, క్రికెట్ టూర్ పేరిట వివిధ దేశాలను తిరిగే సమయంలో అక్కడ కనిపించిన యువతులతో పరిచయాలు ఏర్పరచుకుని కేవలం గంటల వ్యవధిలోనే పడకగదికి తీసుకెళ్లేవాడినని టైనో గొప్పగా చెప్పుకుంటున్నాడు. తనకొక స్నేహితురాలు ఉండేదని, కొన్ని కారణాల వల్ల ఆమెతో బ్రేకప్ అయిందన్నాడు. ఆమె కోసం తొలుత ఎంతగానో ఎదురుచూశానన్నాడు. క్రికెట్ బాగా ఆడి వికెట్లు పడగొట్టడం ప్రారంభించూ.. ఆమె నిన్ను వెతుక్కుంటూ పరుగున వస్తుందని కొందరు స్నేహితులు సలహా ఇచ్చారు.
వారి సలహా ప్రకారం క్రికెట్లో మంచి పేరు తెచ్చుకున్నా ఆమె మాత్రం తనకోసం రాలేదని గత స్మృతులను గుర్తుచేసుకున్నాడు. తాను క్రికెటర్ కావడంతో ఏ అమ్మాయి కూడా తనతో సెక్స్‌కు నిరాకరించలేదని బహిరంగంగా చెప్పుకొచ్చాడు. ఈ ఆటగాడు ఒకరు కాదు ఇద్దరు కాదు కనీసం 500 నుంచి 650 మంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్నానని వెల్లడించాడు.
వెస్టిండీస్ జట్టుతో పర్యటనల్లో ఉన్నప్పుడు చేసిన ఘనకార్యమే ఇది అని తెలిపాడు. ''నాకు అమ్మాయిలంటే ఇష్టం. నేనంటే కూడా వారికి ఎంతో ప్రేమ. ప్రపంచంలో బాగా కనపడే బట్టతల మగాణ్ని నేను. నేను బ్లాక్ బ్రాడ్ పిట్ అని కూడా సరదాగా అంటుంటా. క్రికెటర్‌గా ఎక్కడికి వెళ్లినా అమ్మాయిలతో మాట్లాడే వాణ్ని'' అని పుస్తకంలో బెస్ట్ చెప్పాడు.
కానీ తాను చూసిన అమ్మాయిల్లో ఆస్ట్రేలియా యువతులే అద్భుతమైన అందగత్తెలని, రసికప్రియులని కితాబునిచ్చాడు. తాను ఇంత విచ్చలవిడి జీవితం గడుపుతున్నా తన క్రికెట్ జీవితానికి తన అలవాటు ఏమాత్రం బాధించలేదని అన్నాడు. దేశం కోసం ఆడేందుకు తాను గర్వపడతానని, ఆ విషయంలో తన అంకితబావం అందరికీ తెలుసని, అదే సమయంలో తన వ్యక్తిగత అలవాట్లను ఎంజాయ్ చేయడం కూడా ముఖ్యమేనన్నాడు.