Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా క్రికెటర్ల పట్ల హెడ్ కోచ్ మద్యం సేవించి అసభ్య ప్రవర్తన.. సస్పెండ్

Advertiesment
jaisimha

ఠాగూర్

, శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (13:43 IST)
బస్సులో మద్యం సేవిస్తూ మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ కోచ్‌ జైసింహాపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వేటువేసింది. కోచ్ జైసింహా తమతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేయడంతో హెచ్.ఏ.సి. కఠిన చర్య తీసుకుంది. మద్యం తాగి తమను దూషించాడటని మహిళా క్రికెటర్లు గత నెల 12వ తేదీన మెయిల్ ద్వారా హెచ్.ఏ.సి కి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై హెచ్.ఏ.సి విచారణకు ఆదేశించింది.
 
మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణలను కోచ్ ఖండించారు. కోచ్ జైసింహా తీరుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచ్ బాధ్యతల నుంచి ఆయనను తక్షణం తపిస్తున్నట్టు అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగింతే ఉపేక్షించేది లేదు. వారికి హెచ్.ఏ.సి అండగా ఉంటుంది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. మహిళా క్రికెటర్లపై వేధింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతాం. విచారణ ముగిసే వరకూ కోచ్ జైసింహాను సస్పెండ్ చేస్తున్నాం అని తెలిపారు. 
 
ఆ టూర్ వరకు టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతారు... 
 
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతున్నారు. ఈ కాంట్రాక్టు కాలం ముగిసిపోయింది. గత యేడాది వన్డే ప్రపంచ కప్ తర్వాత ముగిసింది. కానీ, ఆయన టీమిండియా కోచ్‌గా కొనసాగుతున్నారు. దీనిపై బీసీసీఐ కార్యదర్శి జై షా వివరణ ఇచ్చారు. జూన్ నెలలో జరుగనున్న టీ20 ప్రపంచ కప్ వరకు ద్రవిడ్ కొనసాగుతాని చెప్పారు. 
 
గత యేడాది ప్రపంచ కప్ తర్వాత ద్రవిడ్, సపోర్టు స్టాఫ్ కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ డిసెంబరు - జనవరిలో జరగనున్న సౌతాఫ్రికా టూర్ వరకు కొనసాగాలని బీసీసీఐ కోరింది. అయితే, అది ఎంతకాలం అన్నది మాత్రం అప్పుడు చెప్పలేదు. ద్రవిడ్‌తో తాను మాట్లాడానని వెస్టిండీస్ - అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ వరకు కొనసాగాలని కోరినట్టు జై షా నిన్న వెల్లడించారు. ప్రపంచ కప్ తర్వాత ద్రవిడ్ వెంటనే సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లడంతో అపుడు మాట్లాడటం కుదరలేదని, అదిప్పుడు జరిగిందని తెలిపారు. 
 
"రాహుల్ ద్రవిడ్ వంటి సీనియర్ కాంట్రాక్ట్ గురించి మీరెందుకు చింతిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ వరకు రాహుల్ భాయ్ కోచ్‌గా ఉంటారు" అని షా నొక్కి చెప్పారు. 'సమయం దొరికినపుడు రాహుల్‌తో మాట్లాడుతా. ప్రస్తుతం వరుస సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు. అపుడేమో సౌతాఫ్రికా టూర్, ఆ వెంటనే స్వదేశంతో ఆప్ఘనిస్థాన్‌తో సిరీస్ ఇంగ్లండ్‌‍తో టెస్ట్ సిరీస్. ఈ నేపథ్యంలో అతడితో మాట్లాడటం కుదరలేదు' అని షా చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెటర్ సూర్య మెసేజ్ వల్లే ఆ భాగ్యం కలిగింది : సర్ఫరాజ్ తండ్రి