Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆధార్ కార్డు పుణ్యంతో.. ధోనీ పర్సనల్ విషయాలన్నీ బట్టబయలయ్యాయ్..

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ వ్యక్తిగత సమాచారం ఆధార్ కార్డు పుణ్యంతో బట్టబయలైంది. తనకు ఆధార్ కార్డు కావాలని ధోనీ పెట్టుకున్న పిటిషన్‌పై స్పందించిన ప్రభుత్వ ఏజెన్సీ సిఎస్‌సి ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండి

Advertiesment
ఆధార్ కార్డు పుణ్యంతో.. ధోనీ పర్సనల్ విషయాలన్నీ బట్టబయలయ్యాయ్..
, బుధవారం, 29 మార్చి 2017 (09:01 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ వ్యక్తిగత సమాచారం ఆధార్ కార్డు పుణ్యంతో బట్టబయలైంది. తనకు ఆధార్ కార్డు కావాలని ధోనీ పెట్టుకున్న పిటిషన్‌పై స్పందించిన ప్రభుత్వ ఏజెన్సీ సిఎస్‌సి ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అధికారులు ధోనీ వేలిముద్రలను సిస్టమ్‌లో స్కాన్ చేయడంతో సరిపెట్టుకోకుండా.. అత్యుత్సాహం ప్రదర్శించడంతో ధోనీ దరఖాస్తు బహిరంగమైపోయింది. 
 
ఈ జార్ఖండ్ క్రికెటర్ సమర్పించిన ఆధార్ కార్డు దరఖాస్తుపత్రాన్ని స్క్రీన్ షాట్ తీసిన నిర్వాహకులు నేరుగా దాన్ని ట్విట్టర్‌లో ట్వీట్ చేయడంతో ధోనీ కొంప మునిగింది. వ్యక్తిగత సమాచారం ఉండే దరఖాస్తు పత్రాన్ని ఇలా సోషల్ మీడియాకు ఎలా పంపుతారంటూ ధోని భార్య సాక్షి నేరుగా కేంద్ర న్యాయ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ధోనీ దరఖాస్తు ద్వారా గోప్యతగా ఉన్న విషయాన్ని పబ్లిక్ చేశారని సాక్షి మండిపడ్డారు. 
 
ఈ వ్యవహారంలో మంత్రి రవిశంకర్ ప్రసాద్ సైతం అదే తప్పు చేశారు. ప్రభుత్వ ఏజెన్సీ ధోనీ దరఖాస్తుపత్రంపై చేసిన ట్వీట్‌ను మంత్రి తొందరపాటుతో రీ ట్వీట్ చేశారు దాంతో అది ఇంకా చేరనివాళ్లకు చేరిపోయింది.
 
సాక్షి ట్వీట్‌కు మంత్రి రవిశంకర ప్రసాద్ స్పందిస్తూ, లేదు లేదు. ధోనీ సమాచారం పబ్లిక్ ప్రాపర్టీ కాదు, ఈ ట్వీట్ ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉందా అని రీట్వీట్ చేశారు. దాంతో సాక్షి ఆ ప్రభుత్వ ఏజెన్సీ తన భర్త ఆధార్ కార్డు సమాచారాన్ని ట్వీట్ చేసిన స్క్రీన్ షాట్‌ను మంత్రికి పంపారు. ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చినందుకు మంత్రి సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత సమాచారం షేర్ చేయడం చట్టవిరుద్ధం అని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్య తీసుకుంటామని ప్రసాద్ దాన్ని రీట్వీట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెస్టు మ్యాచ్‌ను ఐపీఎల్ బాదుడు మ్యాచ్‌గా మార్చిన రహానే