Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : చరిత్రలో దారుణమైన ఓటమిని చవిచూసిన ఇంగ్లండ్

england
, ఆదివారం, 22 అక్టోబరు 2023 (12:51 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలక పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు చరిత్రలో దారుణమైన ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు ఏకంగా 229 పరుగులు తేడాతో ఓడిపోయింది. వరల్డ్ కప్ చరిత్రలోనే ఇంగ్లండ్ జట్టుకు ఇది అత్యంత ఘోర పరాజయం.
 
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఛేదనకు మొగ్గు చూపింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. సఫారీ ఓపెనర్లు క్లాసెన్ (109) సెంచరీ, హెండ్రిక్స్ (85), వాన్‌డర్ డుస్సెన్ (60), యన్ సెన్ (75 నాటౌట్) అర్థసెంచరీలతో అతి భారీ స్కోరు నమోదు చేశారు. 
 
ఆ తర్వాత 400 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఆటతీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బాగుంటుందేమో! జానీ బెయిర్ స్టో (10), డేవిడ్ మలాన్ (6), జో రూట్ (2), బెన్ స్టోక్స్ (5), కెప్టెన్ జోస్ బట్లర్ (15), హ్యారీ బ్రూక్ (17) వంటి స్టార్లు ఉన్నప్పటికీ ఇంగ్లండ్ 22 ఓవర్లలో 170 పరుగులకే కుప్పకూలింది.
 
టెస్టుల్లోనూ ధనాధన్ బ్యాటింగ్‌ను తీసుకువచ్చి, క్రికెట్‌కు సరికొత్త ఒరవడి చూపించిన ఇంగ్లండ్ జట్టేనా ఇలా ఆడింది అని సందేహం కలిగించేలా పరమ చెత్త ఆటతీరు కనబర్చింది. మ్యాచ్ ఆఖరులో మార్క్ ఉడ్ (43 నాటౌట్), గస్ ఆట్కిన్సన్ (35) పోరాడడంతో ఆ మాత్రం స్కోరు వచ్చింది. 
 
మార్క్‌వుడ్ 17 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 5 సిక్సులు బాదాడు. ఆట్కిన్సన్ 7 ఫోర్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటింగే కాదు... బౌలింగ్, ఫీల్డింగ్ కూడా అత్యున్నత ప్రమాణాలతో కొనసాగాయి. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ కోట్టీ 3, ఎంగిడి 2, యన్ సెన్ 2, రబాడా 1, కేశవ్ మహరాజ్ 1 వికెట్ తీశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : కివీస్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు షాక్