Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరల్డ్ కప్ ఫైనల్ : న్యూజిలాండ్‌ను ఓడించిన న్యూజిలాండ్ పౌరుడు

Advertiesment
వరల్డ్ కప్ ఫైనల్ : న్యూజిలాండ్‌ను ఓడించిన న్యూజిలాండ్ పౌరుడు
, సోమవారం, 15 జులై 2019 (10:04 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ సమరం ఆదివారం లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరిగింది. అత్యంత రసవత్తరంగా సాగిన ఈ తుదిపోరులో ఇంగ్లండ్ జట్టు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య విశ్వవిజేతగా నిలిచింది. అయితే, ఇంగ్లండ్ జట్టులోని ఆటగాళ్లు అద్భుతంగా పోరాటం చేయగా, న్యూజిలాండ్ ఆటగాళ్లు అంతకు రెట్టింపు స్థాయిలో పోరాడి ఓడిపోయారు. 
 
అయితే, న్యూజిలాండ్ జట్టు ఓడిపోవడం వెనుక ప్రధానంగా న్యూజిలాండ్‌లో పుట్టిన ఆటగాడే కీలక భూమిక పోషించడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 241 పరుగులు చేసింది. ఆ తర్వాత 242 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ స్కోరు కూడా 241 పరుగుల వద్దే ఆగిపోయింది. 
 
ఆ తర్వాత సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. ఇందులో కూడా ఇరు జట్లూ 15 పరుగుల చొప్పున చేశాయి. అయితే, మ్యాచ్‌లో అత్యధికంగా బౌండరీలు ఇంగ్లండ్ ఆటగాళ్లు కొట్టివుండటంతో వాటి ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. అలా ఇంగ్లండ్ జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. 
 
అయితే, ఇంగ్లండ్ విజయంలో ముఖ్యంగా తుది పోరులో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్ ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ ఒకడు. ఈయన కివీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యిలామారిపోయాడు. ఒకవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ క్యూ కడుతున్నా... స్టోక్స్ మాత్రం కివీస్ బౌలర్లకు ఎదురొడ్డి 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అలా తన దేశ జట్టుకు విశ్వకప్‌ను అందించి, దశాబ్దాల కలను నెరవేర్చాడు. తద్వారా మ్యాన్ ఆఫ్ ది ఫైనల్‌గా ఎంపికయ్యాడు. 
 
ఇంతవరకు బాగానేవుంది. అయితే, న్యూజిలాండ్‌కు ముచ్చెమటలు పట్టించి ఇంగ్లండ్ ప్రపంచకప్ కలను సాకారం చేసిన బెన్ స్టోక్స్ పుట్టింది న్యూజిలాండ్‌లో కావడం విశేషం. 28 ఏళ్ల స్టోక్స్ ఆ దేశంలోని క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించాడు. ప్రపంచకప్ పైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుని ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్ అయ్యాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సూపర్' వరల్డ్ కప్ : బౌండరీలతో విజేత ఎంపిక.. క్రికెట్ పుట్టినింటికి కప్