Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ అరుదైన రికార్డు

Advertiesment
విండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ అరుదైన రికార్డు
, మంగళవారం, 13 జులై 2021 (11:16 IST)
వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పొట్టి క్రికెట్ టీ20 ఫార్మెట్‌లో ఏకంగా 14 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ-20లో ఈ మైలురాయిని అందుకున్నాడు. 
 
అటు ఈ మ్యాచ్‌లో గేల్ 38 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఏడు సిక్స్‌ల సాయంతో 67 పరుగులు చేశాడు. ఫలితంగా 142 పరుగుల టార్గెట్‌ను ఉఫ్ మని ఊదేసి విండీస్ ఘనవిజయం అందుకుంది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఐదు టీ-20ల సిరీస్‌ను వెస్టిండీస్ 3-0తో సొంతం చేసుకుంది. 
 
కాగా విండీస్ తరపున గేల్ ఐదేళ్ల తర్వాత అర్ధసెంచరీ సాధించడం విశేషం. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా విండీస్‌ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ కారణంగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. 
 
ఆసీస్‌ బ్యాటింగ్‌లో హెన్రిక్స్‌ 33, కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 30 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో షెల్డన్‌ కాట్రెల్‌ 3, ఆండీ రసెల్‌ 2 వికెట్లు తీశారు. కాగా సిరీస్‌లో నామమాత్రంగా మారిన మిగిలిన రెండు మ్యాచ్‌లు జూలై 14, 16న జరగనున్నాయి. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Peter Handscombకు కరోనా.. ఐసోలేషన్‌కు వెళ్లిపోగా..?