Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చాంపియన్స్ ట్రోఫీ : ఇంగ్లండ్‌ హ్యాట్రిక్‌ విక్టరీ... ఆస్ట్రేలియా అవుట్‌

చాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ హ్యట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా సెమీస్‌కు బంగ్లాదేశ్‌ చేరింది. శనివారం జరిగిన గ్రూప్‌-ఏ ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్

చాంపియన్స్ ట్రోఫీ : ఇంగ్లండ్‌ హ్యాట్రిక్‌ విక్టరీ... ఆస్ట్రేలియా అవుట్‌
, ఆదివారం, 11 జూన్ 2017 (12:08 IST)
చాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ హ్యట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా సెమీస్‌కు బంగ్లాదేశ్‌ చేరింది. శనివారం జరిగిన గ్రూప్‌-ఏ ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 40 పరుగులతో ఆస్ట్రేలియాను ఓడించింది. కంగారు జట్లు నిర్దేశించిన 278 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు 40.2 ఓవర్లలో 204/4 స్కోరుతో గెలుపు ముంగిట నిలిచిన సమయంలో వర్షం కారణంగా ఆట ఆగిపోయింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. పలువురు ఆటగాళ్లు రాణించినప్పటికీ, ఎవరూ భారీ స్కోరు చేయలేకపోవడం ఆ జట్టుకు శాపమైంది. ఫించ్‌ 68, స్మిత్‌ 56, ట్రావిస్‌ హెడ్‌ 71 పరుగులు చేశారు. ఆపై 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఆదిలోనే తడబడింది. 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో తొలిసారి ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఆపై ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత మోర్గాన్‌, స్టోక్స్‌ విరుచుకుపడటంతో, 20 ఓవర్లకే 126 పరుగులు సాధించి, వర్షం పడ్డా గెలిచేందుకు కావాల్సిన పరుగులను సాధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాంపియన్స్ ట్రోఫీ : భారత్‌కు చావో రేవో.. గెలిస్తేనే సెమీస్‌కు.. మ్యాచ్ రద్దు అయితే?