Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైన్యం తరపున పాక్ క్రికెటర్లకు తీర్థయాత్రలు : ఆర్మీ చీఫ్

ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి భారత్‌పై ఘన విజయం సాధించిన పాక్ క్రికెటర్లపై ఆ దేశంలో ప్రశంసల జల్లు కురుస్తోంది. మరోవైపు జట్టు సభ్యులకు వరాల జల్లు కూడా మొదలైంది. ఫై

సైన్యం తరపున పాక్ క్రికెటర్లకు తీర్థయాత్రలు : ఆర్మీ చీఫ్
, సోమవారం, 19 జూన్ 2017 (12:29 IST)
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి భారత్‌పై ఘన విజయం సాధించిన పాక్ క్రికెటర్లపై ఆ దేశంలో ప్రశంసల జల్లు కురుస్తోంది. మరోవైపు జట్టు సభ్యులకు వరాల జల్లు కూడా మొదలైంది. ఫైనల్స్ ముగిసిన కాసేపటికే ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వా తమ ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. జట్టు సభ్యులకు 'ఉమ్రా' ప్రకటించారు. సైన్యం తరపును జట్టు సభ్యులను ఉమ్రా యాత్రకు పంపుతున్నట్టు తెలిపారు. ముస్లింలు చేపట్టే మక్కా తీర్థయాత్రను ఉమ్రా అంటారు.  
 
కాగా, ఆదివారం జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్ జట్టు విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. అంచనాలను తలకిందలు చేస్తూ.. అసాధారణ ప్రదర్శన చేసిన పాక్‌.. చాంపియన్స్‌ ట్రోఫీని పట్టేసింది. అంతిమ సమరంలో ఫఖర్‌ జమాన్‌ (106 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 114) వీరోచిత శతకానికి.. మహమ్మద్‌ ఆమెర్‌ (6-2-16-3) సంచలన బౌలింగ్‌ తోడవడంతో భారత్‌ను 180 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. భారత్‌కు 339 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన పాక్‌.. కోహ్లీసేనను 30.3 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూల్చి, తొలిసారి చాంపియన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫైనల్లో ఓడిపోయాక సాకులు చెప్పడం అనవసరం కానీ.. ఒకే తప్పు పదే పదే జరిగితే ఎలా?