Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సిడ్నీ వీధుల్లో కోహ్లీ దంపతలు చక్కర్లు! (Video)

Virat Kohli_ Anushka Sharma

ఠాగూర్

, బుధవారం, 1 జనవరి 2025 (13:38 IST)
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఉన్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి సిడ్నీ వీధుల్లో చక్కర్లు కొడుతూ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు టెస్టులు ముగిశాయి. ఆఖరిదైన ఐదో టెస్టు సిడ్నీ వేదికగా జరుగనుంది. దీనికోసం టీమిండియా మెల్‌బోర్న్ నుంచి సిడ్నీ చేరుకుంది. ఈ క్రమంలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి సిడ్నీ వీధుల్లో చక్కర్లు కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
స్టార్ కపుల్ న్యూ ఇయర్ పార్టీ కోసం బ్లాక్ అవుట్ ఫిట్‌లో వెళ్తుండడం వీడియోలో ఉంది. వారితో పాటు యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ కూడా వీడియోలో కనిపించారు. ఈ వీడియోను విరాట్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ చేస్తుండడంతో వైరల్గా మారింది.
 
ఇదిలావుంటే.. బీజీటీ సిరీస్‌లో రోహిత్ సేన అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులోనూ భారత్ ఘోర ఓటమి చవిచూసింది. దాంతో టీమిండియాపై విమర్శలు మరింత పెరిగాయి. ఇప్పటికే 2-1తో సిరీస్ భారత జట్టు వెనుకబడింది.
 
ఈ క్రమంలోనే సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై మాజీలు పెదవి విరుస్తున్నారు. జట్టుకు అండగా ఉండాల్సిన వీరిద్దరూ భారంగా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పడం గమనార్హం. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీమిండియాలో నితీశ్ స్థానం పదిలం : సునీల్ గవాస్కర్