నేడు పూణె వన్డే : భారత్‌కు చావో రేవో... ఆత్మవిశ్వాసంతో కివీస్
స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. పూణె వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారత్‌కు చావో రేవోగా మారింది.
స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. పూణె వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారత్‌కు చావో రేవోగా మారింది. ఇప్పటికే తొలి వన్డేలో ఓడిపోయిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు నిలుపుకోవచ్చు. ఫలితంగా కోహ్లీ సేన అమీతుమీ తేల్చుకోనుంది.
బుధవారం మధ్యాహ్నం గం.1.30ని.లకు ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆరంభం కానుంది. తొలి వన్డేలో ఊహించని పరాజయంతో విరాట్ సేన ఒత్తిడిలో ఉండగా, మరొకవైపు న్యూజిలాండ్ రెట్టించిన ఉత్సాహంతో రెండో వన్డేకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ ఆరు వరుస వన్డే సిరీస్‌లను గెలిచిన విరాట్ సేనకు ఈ మ్యాచ్ ఖచ్చితంగా అగ్ని పరీక్షే. న్యూజిలాండ్‌ను చుట్టేయడం ఖాయమనుకున్న తరుణంలో ఆ జట్టు మొదటి వన్డేలోనే ఊహించని షాక్ ఇచ్చింది.
భారత్ విసిరిన 281 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి... తమను తక్కువ అంచనా వేయొద్దనే సంకేతాల్ని ముందుగానే పంపింది. మరి దీన్నినుంచి తేరుకుని విరాట్ సేన రెండో వన్డేలో సమష్టిగా రాణించాల్సి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కివీస్‌పై భారత్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తేనే సిరీస్‌లో ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుంది. లేని పక్షంలో ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోవాల్సి వస్తుంది.