తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. అయినప్పటికీ ప్రజా ప్రతినిధులు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ కరోనా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డికి ఈ వైరస్ సోకింది.
గత మూడు రోజులుగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనేక మందిని కలిశారు. వారితో దగ్గరగా మెలికారు. కరచాలనం చేశారు. దీంతో ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. పైగా, తనతో కాంటాక్ట్ అయిన వారంతా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు, నిరంజన్ రెడ్డికి కరోనా వైరస్ సోకడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత యేడాది ఏప్రిల్ నెలలో కూడా ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే. అదేసమయంలో తెలంగాణాలో కూడా కోవిడ్ పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నాయి.