Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా మహామ్మారికి మరో నటుడు బలి..

కరోనా మహామ్మారికి మరో నటుడు బలి..
, మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:01 IST)
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. ఈ లాక్‌‌డౌన్‌ సడలింపులతో వైరస్‌ మరింతగా వేగంగా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజుకు సరాసరి లక్ష కేసులు నమోదువుతున్నాయి. కరోనా బారిన పడి పేదధనిక తేడా లేకుండా ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. కొందరు ఈ మహామ్మారి బారిన పడి కన్ను మూస్తున్నారు. ఇప్పటికే దిలీప్ కుమార్ తమ్ముడు సహా పలువురు ప్రముఖలు కోవిడ్ కారణంగా కన్నుమూసారు. 
 
తాజాగా కరోనా మహామ్మారి మరో నటుడిని బలి తీసుకుంది. తమిళం, మలయాళంలో తన నటనతో ఆకట్టుకున్న ఫ్లోరెంట్ పెరిరా అనే నటుడు కరోనా కారణంగా సోమవారం మరణించారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. తమిళంలో ప్రముఖ కారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫ్లోరెంట్ పెరిరాకు మంచి ఇమేజ్ ఉంది. 
 
రాజా మందిరి, ధర్మదురై వంటి చిత్రాల్లో ఈయన నటించారు. ఈయన కలైజ్ఞర్ టీవీ ఛానెల్‌కు కొన్నాళ్లు జనరల్ మేనేజర్‌గా పనిచేసారు. ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నారు. ఈయన మృతికి తమిళనాడుకు చెందిన సినీనటులుతో పాటు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడలితో మామ పారిపోయాడు.. అవమానంతో తలదించుకున్న భర్త