Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజృంభిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ ... ఇప్పటికే ముగ్గురు మృతి

h3n2virus
, మంగళవారం, 14 మార్చి 2023 (15:00 IST)
దేశంలో కొత్త వైరస్ హెచ్3ఎన్2 వైరస్ విజృభిస్తుంది. ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో నమోదైంది. ఈ వైరస్ బారినపడిన 58 యేళ్ళ ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. అయితే, ఈమె అప్పటికే అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతూ వచ్చినట్టు సమాచారం.
 
అలాగే, కర్నాటక, హర్యానా రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్కరు చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఈ కేసులు పెరుగుతున్నాయి. హెచ్3ఎన్2 వైరస్ అనేది ఏ ఉప రకం. ఈ వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతున్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ వైరస్ సోకినవారికి జలుబు, శరీర నొప్పులు ప్రధానంగా కనిపిస్తాయి. అయితే, ఈ వైరస్ క్రమంగా రోగి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుందని వైద్యులు తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు అధిక సంఖ్యలో ఈ వైరస్ బారినపడి ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్లో అర్థరాత్రి మహిళా ప్రయాణికురాలి తలపై మూత్ర విసర్జన చేసిన టీసీ!