Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జర్మనీలో మళ్లీ లాక్ డౌన్.. వారం రోజులు అవన్నీ మూసివేత

Advertiesment
Germany
, గురువారం, 29 అక్టోబరు 2020 (14:46 IST)
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. భారత్‌తో సహా కొన్ని దేశాలు కరోనా నుండి నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో జర్మనీలో మాత్రం కరోనా తీవ్రత మళ్లీ ఎక్కువైంది. అక్కడ ఉన్నట్టుండి కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. 
 
కరోనా పేషెంట్లతో ఆసుపత్రులు నిండిపోతుండం, వైరస్ సంబంధిత మరణాలు పెరిగిపోతుండటంతో జర్మనీ మరోసారి లాక్ డౌన్ విధించడానికి సన్నద్ధమవుతుంది. దీనిలో భాగంగా రెస్టారెంట్లు, జిమ్‌లు, థియేటర్లు వంటి వాటిని నెల రోజుల పాటు మూసివేయాలని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ పేర్కొన్నారు.
 
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మోర్కెల్ మాట్లాడుతూ.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున తక్షణమే మరోసారి లాక్డౌన్ విధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా లాక్ డౌన్ నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు.
 
నవంబర్ 2 నుండి అమలు కానున్న ఈ లాక్‌డౌన్‌లో భాగంగా కేవలం 10 మందితోనే ప్రైవేట్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాక రెస్టారెంట్లు, బార్లు, థియేటర్లు, సినిమా ఘూటింగ్స్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ సెంటర్లు అన్నీ మూసివేయబడతాయని చెప్పారు. 
 
గత 24 గంటల్లో 14,964 కేసులు పెరగగా అక్కడ మొత్తం కేసుల సంఖ్య 4,64,239కు చేరుకుందని జర్మనీ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ ఏజెన్సీకి చెందిన రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. మహమ్మారి సమసిపోతున్న క్రమంలో కేసుల సంఖ్య భారీగా పెరిగి బ్రేకింగ్ పాయింట్‌ను తాకవచ్చని ఛాన్సలర్ మోర్కెలా హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆక్స్‌ఫర్డ్ టీకా గురించి గుడ్ న్యూస్ అందించిన సీరమ్