Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జంతువుల్లోనూ కరోనా వ్యాప్తి.. సింహాలు చనిపోవడానికి కారణం అదేనట!

జంతువుల్లోనూ కరోనా వ్యాప్తి.. సింహాలు చనిపోవడానికి కారణం అదేనట!
, శనివారం, 1 మే 2021 (20:25 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా మానవాళి నానా తంటాలు పడుతోంది. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ వ్యాప్తి జంతువుల్లోనూ మొదలైందని పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. అటవీ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు కొన్ని సింహాలు చనిపోవడానికి కరోనావైరస్ కారణమని తేలిందట. 
 
ఇంకా జంతువుల మధ్య వైరస్ వ్యాప్తి జరిగే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖ చెప్తోంది. ఈ మేరకు నేషనల్ పార్క్స్/శాంక్చువరీలు, ఇతర సంరక్షక ప్రాంతాల్లో టూరిస్టులు వెళ్లకూడదని వాటిని వెంటనే మూసేయాలని చెప్పారు.
 
ఇవన్నీ వెంటనే అమల్లోకి రావాలని ఆదేశాలిచ్చారు. అడవులు, వాతవారణ మార్పులు జంతువుల విభాగం నేషనల్ పార్కులు, వాటి సంరక్షక ప్రాంతాల్లో ప్రజలను తిరగవద్దంటూ ఆంక్షలు విధించారు. స్టాఫ్/ గ్రామస్థులు ఆ ప్రాంతాల్లో తిరగొద్దని ఆరోగ్య కుటుంబ సంక్షేమ ఆదేశాలు జారీ చేసింది.
 
ప్రాణాంతక మహమ్మారి జంతువుల్లోనూ వ్యాప్తి చెందుతుందని.. అలాగే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమైంది. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అత్యవసర సేవను, జంతువులకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆదేశించింది.
 
లక్షణాలు ఉన్న వారిని, లక్షణాలు కనిపించకుండా ఉంటున్న వారి నుంచి సైతం కొవిడ్ వ్యాప్తి జరుగుతుంది. కొందరిలో లక్షణాలు కనిపించకపోయినా కరోనా వాహకాలుగా పనిచేయొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోమ్ ఐసోలేషన్‌లో ఉండేవారికి కేంద్రం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు