వంట చేయాలంటే.. ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. కానీ, కొన్ని కారణాల చేత వంట చేసేందుకు ఇష్టపడరు. అందుకు కారణం చిన్ని చిన్న వంటింటి చిట్కాలు తెలియక పోవడమే. ఈ కింద చిట్కాలు పాటించడం వలన ప్రతీ ఒక్కరికి వంట చేయాలనే ఆలోచన తప్పకుండా వస్తుంది. మరి అవేంటే ఓసారి తెలుసుకుందాం..
1. అల్లం, వెల్లుల్లిని కాగితంతో పొట్లం కట్టి ఫ్రిజ్‌లో ఉంచుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇక చేప ముక్కలకు కొద్దిగా ఉప్పు కలిపి డీప్ ఫ్రీజర్‌లో పెడితే నిల్వ ఉంటాయి. ముక్కలు అంటుకోకుండా ఉంటాయి.
2. బయటవుంటే నిమ్మకాయలు చెడుపోతున్నాయని.. వాటిని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే అవి గట్టిగా మారిపోతుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. ఫ్రిజ్‌లో ఉన్న నిమ్మకాయను తీసుకు ఓ 10 నిమిషాలు వేడి నీటిలో ఉంచితే ఫలితం ఉంటుంది.
3. చాలామందికి వంకాయలు తినాలంటే చాలా ఇష్టం. కానీ వాటిని కట్‌చేసి వండేలోపు అవి నల్లగా మారిపోతుంటారు. అలాంటప్పుడు ఆ ముక్కలు కడిగే నీటిలో కొద్దిగా పాలు వేస్తే నల్లబడవు.
4. బ్లీచింగ్ పౌడర్, ముగ్గును సమానంగా కలుపుకుని వాష్ బేసిన్, టాయిలెట్‌లోని పరికరాలు కడిగితే అవన్నీ మెరుస్తాయి. టీ డికాషన్‌లో పాలు పోసినప్పుడు నారింజ రంగు లోకి మారితే కల్తీ పొడి అని గుర్తించండి.. మంటి టీ పొడి అయితే గోధుమ రంగు ఇస్తుంది.
5. వాష్ బేసిన్‌లో కొద్దిగా వాషింగ్ సోడా వేసి ఆ తర్వాత కొద్దిగా వెనిగర్ వేస్తే మూసుకుపోయిన వాష్ బేసిన్ శుభ్రమవుతుంది. అలానే కొద్దిగా తేనెలో ముంచిన దూదిని అగ్గిపుల్లతో కాలిస్తే కల్తీ లేని తేనె బాగా మండుతుంది. ఒకవేళ కల్తీ ఉంటే చిటపట అని శబ్దం వస్తుంది.
6. వంటగదిలో ఈగల బెడద ఎక్కువగా ఉంటే.. పసుపు కలిపిన నీటితో వంటగదిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. పాలు పొంగకుండా ఉండాలంటే పాలు మరిగేటప్పుడు ఆ గిన్నె పై ఓ చెక్క గరిట లేదా స్పూన్ పెట్టండి. లేదా గిన్నె అంచుకు నూనె రాయండి.